Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Priyanka Gandhi Son Wedding | ప్రియాంక గాంధీ కుమారుడు రేహన్ వాద్రా కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న అవీవా బేగ్‌కు ప్రపోజ్ చేయగా ఆమె యాక్సెప్ట్ చేసింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి.

సోనియా గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి వేడుక జరగనుంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం, రేహాన్ వాద్రా ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్న అవీవా బేగ్‌కు ఇటీవల లవ్ ప్రపోజ్ చేశారు. అవీవా కూడా అందుకు అంగీకారం తెలిపింది. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి తమ అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. అవీవా బేగ్ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించారు.
రేహాన్ వాద్రా వివాహం ఎప్పుడు..
రేహాన్ వాద్రా, అవీవా పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇరు కుటుంబాలు పిల్లల ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నాయి. దాంతో వీలును బట్టి, త్వరలో మంచి ముహూర్తంలో వీరి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయి.
అవీవా బేగ్ ఎవరు..
అవీవా బేగ్ ఒక ఫోటోగ్రాఫర్. గత ఐదేళ్లుగా అవీవా బేగ్ అనేక ప్రతిష్టాత్మక కళా ప్రదర్శనలలో పాల్గొన్నారు. 2023లో ఆమె మెథడ్ గ్యాలరీతో కలిసి 'యు కెనాట్ మిస్ దిస్' ప్రదర్శనలో తను వర్క్ చేసిన కళాఖండాలను ప్రదర్శించారు. ఈ ఏడాది ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రామ్ కింద కూడా 'యు కెనాట్ మిస్ దిస్' ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు 2019లో ది క్వోరం క్లబ్‌లో జరిగిన 'ది ఇల్యూజరీ వరల్డ్', 2018లో ఇండియా డిజైన్ ID, K2 ఇండియాలో కూడా ఆమె తన ఫోటోగ్రఫీని ప్రదర్శించారు. అవీవా బేగ్ ఫోటోగ్రాఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీ 'అటెలియర్ 11' సహ-వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలు, బ్రాండ్లు, క్లయింట్‌లతో కలిసి వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి పోటీ చేసిన ఆమె ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె తన, తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను వెల్లడించారు.
రాబర్ట్ వాద్రా మొత్తం ఆస్తి విలువ
ప్రియాంక గాంధీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, సార్వత్రిక ఎన్నికల సమయానికి రాబర్ట్ వాద్రా మొత్తం ఆస్తి 65.54 కోట్లు. ఇందులో 37.9 కోట్ల రూపాయల చరాస్తులు, 27.64 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. దీంతో పాటు ఆయన పేరు మీద 10 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం, రాబర్ట్ వాద్రా వద్ద రూ. 2.18 లక్షల నగదు ఉంది. వివిధ బ్యాంకుల్లో ఆయన పేరిట సుమారు 50 లక్షల రూపాయలు ఉన్నాయి. దీంతో పాటు ఆయన పేరిట కోట్ల మేర లోన్స్ ఉన్నాయి. సుమారు 34 కోట్ల మేర అప్పు తీసుకున్నారు.
రాబర్ట్ వాద్రా వ్యాపారవేత్త
రాబర్ట్ వాద్రా ఖరీదైన కార్లు, బైక్‌లంటే ఇష్టపడతారు. ఆయన వద్ద మొత్తం 3 వాహనాలు ఉన్నాయి, వాటిలో 53 లక్షల విలువైన టయోటా ల్యాండ్ క్రూజర్ కూడా ఉంది. రాబర్ట్ వాద్రా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ఆయన హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, కస్టమ్ జ్యువెలరీ వ్యాపారం చేస్తారు. ఆయన కంపెనీ పేరు 'ఆర్టెక్స్ ఎక్స్‌పోర్ట్స్'. దీంతో పాటు ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. అనేక ఇతర కంపెనీలలో పెట్టుబడుల ద్వారా ఆయన భాగస్వామ్యం ఉంది.






















