అన్వేషించండి

Guntur Crime News: గుంటూరు మహిళ మర్డర్‌ కేసులో ట్విస్టు- అత్యాచారం చేసి చంపేశారని భర్త ఆరోపణ

భర్త తిరుపతి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న ఇంట్లో భార్య హత్యకు గురైంది. పట్టపగలే హత్య చేసిందెవరు?

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. దుండగులు వివాహితను హత్య చేసి వివస్త్రను చేశారు. సమాచారం అందుకున్న దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.  

వీరంకి తిరుపతమ్మ, శ్రీనివాసరావు దంపతులు పంట పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు తిరుపతి వెళ్లగా తిరుపతమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంది. సాయంత్రానికి ఆమెను దుండగులు హత్య చేశారు. అంతే కాదు వివస్త్రను చేసి పడేశారు. 

ఇంట్లో పడి ఉన్న తిరుపతమ్మను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో కలిసి ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసే సమయంలో తిరుపతమ్మ దుండగులతో పెనుగులాడినట్టు అర్థమవుతుందని, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేశారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. 

సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టు లైంగికదాడి అయితే జరగలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు పోలీసులు. తిరుపతమ్మకు తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందనే దర్యాప్తు చేపట్టామని, ఘటనాస్థలంలో నిందితులు తాగి పడేసిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వివరించారు.

దుగ్గిరాల మండలంలో తుమ్మపూడిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో వీరంకి. శివరామకృష్ణ, మరీదు సాయి, కొర్రపాటి సాయి చరణ్ ప్రమేయం ఉందని ఆమె భర్త శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ ఘటనపైన దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో అనుమానితులు పేర్లు చెప్పారు. అయితే అనుమానితుల పేర్లు చెప్పొద్దు... అనుమానం కేసుగా నమోదు చేస్తామని పోలీసులు చెప్పారని శ్రీనివాస రావు ఆరోపించారు. 

ఈ కేసులో నిందితులకు ఓ పార్టీ నాయకుల అండ ఉందని ఆరోపిస్తున్నారు శ్రీనివాస రావు. వీళ్లంతా తెనాలి ఐతానగర్‌కు చెందిన వారిగా పేర్కొన్నారు. నిన్న ఉదయం నుంచి ఈ ముగ్గురు నిందితులు తమ ఇంటి సమీపంలో ఉన్న మద్యం షాపుల్లో విపరీతంగా మద్యం సేవించారని వివరించారు. పదే పదే లక్ష్మీతిరుపతమ్మకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. 

గత కొన్ని రోజుల నుంచి కూడా తన భార్యకు ఫోన్ ద్వారా వేధిస్తున్నారని తెలిపారు శ్రీనివాస్‌. గతంలో కూడా గొడవ జరిగినట్లు వివరించారు. తాను ఉపాధి కోసం తిరుపతిలో పనికి వెళ్లినట్లు తెలిపిన శ్రీనివాసరావు..తాను ఇంటి వద్ద లేనప్పుడు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. తన భార్య ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని అత్యాచారం జరిగిందని కచ్చితంగా నమ్ముతున్నట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీస్ ప్రత్యేక బృందాలు వచ్చి క్లూస్ సేకరించినట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి భర్త కోరుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hit And Run In Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య! అదే కారణమా !
హైదరాబాద్‌లో ఘోరం.. కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య! అదే కారణమా !
AI Copwriter Hyderabad Police: Hyderabad హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!
హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget