అన్వేషించండి

Vijayawada Gym Trainer Case: విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!

Gym Trainer : విజయవాడ సత్యనారాయణపురంలో దారుణం జరిగింది. టీచర్‌కు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు జిమ్ ట్రైనర్. పోలీసులు కేసునమోదు చేయడంతో పారిపోయాడు.

Vijayawada Police SC ST Atrocity Case:  విజయవాడ నగరంలో  ఒక కీచక జిమ్ ట్రైనర్ దారుణానికి ఒడిగట్టాడు. బరువు తగ్గేందుకు జిమ్‌కు వచ్చిన ఒక ప్రైవేట్ స్కూల్ మహిళా టీచర్‌ను లక్ష్యంగా చేసుకుని, మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు సదరు జిమ్ ట్రైనర్ షేక్ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

 ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ప్రొటీన్ షేక్ నెపంతో హోటల్ గదికి!   

పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అబ్దుల్ ఖాదర్ ఆమెకు పరిచయమయ్యాడు.  కొద్దిగా లావుగా ఉన్నావు, సరిగ్గా డైట్ పాటిస్తూ జిమ్ చేస్తే సన్నబడతావు అంటూ నమ్మబలికి, సత్యనారాయణపురంలోని  రాక్ ఫిట్‌నెస్ వరల్డ్  జిమ్‌లో చేర్పించాడు. కొద్దిరోజుల తర్వాత, బరువు తగ్గే ప్రత్యేక ప్రొటీన్ షేక్ ఇస్తానని చెప్పి రామావరప్పాడు, సత్యనారాయణపురం పరిధిలోని ప్రైవేట్ హోటల్ గదికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ప్రొటీన్ షేక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె స్పృహ తప్పిన తర్వాత   అత్యాచారానికి ఒడిగట్టాడు.

 ఐఫోన్, నగదు కోసం వేధింపులు.. కుల వివక్ష, బూతులు! 

రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు భయంతో కేకలు వేయగా, ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడతానని అబ్దుల్ ఖాదర్ బెదిరించాడు. ఆ ఫోటోల నెపంతో జూన్ వరకు ఆమెను పలుమార్లు బంధించి, విపరీతంగా కొడుతూ, కొరుకుతూ శారీరక హింసకు గురిచేశాడు. అంతటితో ఆగక భయభ్రాంతులకు గురిచేసి ఆమెతో ఐఫోన్ 16 కొనిపించుకోవడమే కాకుండా, విడతల వారీగా ఫోన్ పే ద్వారా రూ.70 వేలు వసూలు చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి నిందితుడి ఇంటికి వెళ్లగా, అతని తల్లిదండ్రులు కులం పేరుతో తీవ్రంగా దూషించారు. 

 అనేకమంది అమ్మాయిలపై ట్రాప్.. జిమ్ ఓనర్ నిర్లక్ష్యం! 

ఆగ్రహించిన నిందితుడు ఆమె న్యూడ్ ఫోటోలను జిమ్‌లోని ఇతరులకు చూపిస్తూ మానసిక నరకం చూపించడంతో ఆమె జిమ్‌కు వెళ్లడం మానేసింది.   సదరు జిమ్ ట్రైనర్ ఇలాగే పలువురు యువతులను ట్రాప్ చేసి, వారందరి వీడియోలను ఫోన్‌లో పెట్టుకుని ఆర్థికంగా, శారీరకంగా దోచుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని జిమ్ ఓనర్ జి. సుధీర్ దృష్టికి తీసుకెళ్లగా, అతను బాధితురాలికి సాయం చేయకపోగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. జూలై 15న ధైర్యం చేసి జిమ్‌కు వెళ్లిన బాధితురాలిని నన్నేం పీకలేవు, ఎవరికైనా చెబితే చంపేస్తా అని ఖాదర్ బహిరంగంగా ప్రాణ బెదిరింపులకు దిగాడు.

కేసు నమోదు.. నిందితుడి కోసం   గాలింపు! 
 
బాధితురాలు తన బాబాయి సాయంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్లు 376  , 384  , 506 తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అబ్దుల్ ఖాదర్‌పై కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ ఖాదర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  నిందితుడికి సహకరించిన జిమ్ ఓనర్ సుధీర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget