అన్వేషించండి

Thalli Bidda Express Vehicles: ఏపీలో కొత్తగా 500 తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు - బాలింతలకు ప్రభుత్వం ఉచిత సొకర్యం

Free Transport for Pregnant Women AP: ఏపీలో మాతా-శిశు సంక్షేమానికి సరికొత్త ఊపిరి. 500 కొత్త 'తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తున్ననారు. బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించనున్నారు.

AP Govt 500 New Thalli Bidda Express Vehicles:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతా–శిశు ఆరోగ్య భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులు క్షేమంగా, ఉచితంగా తమ ఇళ్లకు చేరుకోవడంతో పాటు, అత్యవసర వైద్య పరీక్షలు అవసరమయ్యే గర్భిణులకు రవాణా సదుపాయం కల్పించేందుకు నూతనంగా రూపుదిద్దుకున్న  తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్  వాహనాలను అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల భద్రతా ప్రమాణాలు, ప్రయాణికుల సౌకర్యాలు , ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించేలా రూపొందించిన కొత్త బ్రాండింగ్ డిజైన్లను సీఎం క్షుణ్ణంగా సమీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.                 

రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను ఈ పథకం కింద అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలతో పాటు వారి నవజాత శిశువులు, సహాయకులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం. దీనికి అదనంగా, అధిక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను క్రమం తప్పకుండా ఆసుపత్రులకు తీసుకువచ్చి పరీక్షలు అందించేందుకు కూడా ఈ సర్వీసులను వినియోగిస్తారు. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందనున్నారని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

బాలింతలు, పసిపాపల సౌకర్యార్థం ఈ వాహనాల్లో అత్యాధునిక సదుపాయాలను అమర్చారు. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా పూర్తిస్థాయి ఎయిర్ కండిషనింగ్  వ్యవస్థతో పాటు, బాలింతలు వాహనంలోకి సులభంగా ఎక్కేందుకు ప్రత్యేక ఫుట్‌రెస్ట్‌లు, వెనుక సీట్లలో ప్రయాణీకుల భద్రతకు సీటు బెల్టులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, అనుకోని అత్యవసర పరిస్థితులను తట్టుకునేలా ప్రథమ చికిత్స  కిట్లు, అగ్నిమాపక భద్రతా పరికరాలను వాహనంలో అందుబాటులో ఉంచారు.                           

ఈ వాహనాల సేవలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి వాహనానికి జీపీఎస్  ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానించారు. దీని ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి వాహనాల కదలికలు, లొకేషన్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు వీలుకలుగుతుంది. సీఎం ఆదేశాల మేరకు వాహనాలకు సంబంధించిన అధికారిక స్టిక్కరింగ్ మరియు బ్రాండింగ్ ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించనున్నారు.                                  

కూటమి ప్రభుత్వంలో వైద్యారోగ్య రంగ రూపురేఖలు మారుస్తున్న క్రమంలో ఈ  తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల పునఃప్రారంభం ఒక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రసవానంతర మరణాలను  సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.          

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget