అన్వేషించండి

AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhra Pradesh Rains | బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో బుధవారం సైతం వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జూన్‌లో వర్షాల కొరత, తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి.
  • పలు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్, వాగులు పొంగిపొర్లాయి.
  • తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదై, ప్రజలకు ఉపశమనం లభించింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన, భూగర్భజలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టారు.

Telangana Rains | హైదరాబాద్: జూన్‌లో వర్షాలు కురవలేదని తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందారు. జులై సగం పూర్తయినా సగం వర్షాపాతం కూడా నమోదు కాలేదని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే వేరే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించింది. అయితే ఈ వర్షాకాలం సీజన్‌లో తొలిసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులగా భారీ వర్షాలు కుస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య పలు జిల్లాల్లో వానలు పడటంతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

బుధవారం ఈ జిల్లాల్లో వర్షాలు

వాతావరణ శాఖ సూచనల ప్రకారం... బుధవారం కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రికి తీవ్రరూపం దాల్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండగా, ములుగు, కరీంనగర్ జిల్లాల్లోని వాగుల్లో నీటి ప్రవాహంతో జలకళ వచ్చింది. 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిశాయి. జగిత్యాల, యాదాద్రి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురవడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడింది. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 10.7 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 10.3 సెం.మీ, భూపాలపల్లి జిల్లా పెద్దంపేట్‌లో 9.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జంకాపూర్‌లో అత్యధికంగా 12.2 సెం.మీ, కోటపల్లిలో 12.1 సెం.మీ, తాండూర్‌లో 11.9 సెం.మీ వర్షపాతం రికార్డయింది. చెన్నూరు మండలంలోని అక్కెపల్లి, కత్తెరశాల, సుద్దాల వాగులు ప్రవహించడంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే లక్షెట్టిపేటలో వేప చెట్టు కారుపై కూలడంతో వాహనం ధ్వంసం కాగా, డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Also Read: CM Revanth Reddy: హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అధికారులకు వార్నింగ్

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా బుధవారం ఉమ్మడి  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. దీంతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు,న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అయినా పలు జిల్లాల్లో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ఫోకస్ చేసింది.

Frequently Asked Questions

బుధవారం తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుంది?

వాతావరణ శాఖ సూచనల ప్రకారం, బుధవారం తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం వంటి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.

తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది?

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జంకాపూర్‌లో అత్యధికంగా 12.2 సెం.మీ వర్షపాతం రికార్డయింది. కోటపల్లిలో 12.1 సెం.మీ, తాండూర్‌లో 11.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది?

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఈ వర్షాలకు ముందు రైతుల పరిస్థితి ఎలా ఉంది?

జూన్‌లో వర్షాలు లేక తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందారు. తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే వేరే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget