By: ABP Desam | Updated at : 10 Dec 2021 10:52 AM (IST)
పరువుకోసం ప్రేమ హత్య
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు కూడా వారి ప్రేమని అంగీకరించారు, పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే యువతి సోదరులిద్దరికీ ఆ ప్రేమ వ్యవహారం నచ్చలేదు. అందుకే కాబోయే బావని వారు మట్టుబెట్టారు. నమ్మకంగా పిలిచి విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. నెల్లూరు నగరంలో పట్టపగలు ఈ హత్య జరిగింది. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తున్నా కూడా ఇద్దరు యువకులు, మరో యువకుడిని చంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తర్వాత పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అల్తాఫ్ లవ్ స్టోరీ..
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని జనార్ధన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ అల్తాఫ్ (23) మన్సూర్ నగర్ కు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇద్దరూ కలసి దిగిన ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడంతో పెద్దలు అంగీకరిస్తారని అనుకున్నారు. కానీ, ఓ దశలో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. కొన్నిరోజుల తర్వాత ప్రేమికులిద్దరూ పట్టుబట్టడంతో చివరకు పెళ్లికి అంగీకరించారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఆ యువతి సోదరులిద్దరూ కాబోయే బావని మట్టుబెట్టారు.
అల్తాఫ్ ప్రేమించిన యువతి సోదరులైన హఫీజ్, జలీల్ కు ఈవివాహం ఇష్టం లేదు. ఈ క్రమంలో వారు నమ్మకంగా అల్తాఫ్ తో మాట్లాడటం మొదలు పెట్టారు. పరిచయం పెంచుకున్నారు. శుక్రవారం మన్సూర్ నగర్ కాలువ దగ్గరకు అల్తాఫ్ ను పిలిపించారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రాగా కొంతసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో.. హఫీజ్, జలీల్, మరికొంతమంది కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది. కత్తుల దాడిలో అల్తాఫ్ ప్రాణాలు కోల్పోగా.. కాల్వ పక్కనే ఉన్న ముళ్ల చెట్లలో మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న చిన్నబజార్ ఇన్ స్పెక్టర్ మధుబాబు, ఎస్సై, సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటు ఉన్న కాలేషా కుమారులే హఫీజ్, జలీల్ గా గుర్తించి కేసు నమోదు చేశారు పోలీసులు.
ఉలిక్కిపడ్డ నెల్లూరు..
పట్టపగలు, అందరూ చూస్తుండగా కత్తులతో దాడి చేశారంటే.. వారి ధైర్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ నమ్మకంగా ఓ వ్యక్తిని పిలిచి కొంతసేపు మాట్లాడుకుని అతడిని మట్టుబెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వాళ్లంతా బంధువులు కావాల్సి ఉంది. అయితే, పెళ్లి ఇష్టంలేక, పెళ్లిని ఆపలేక ఇలా పెళ్లి కొడుకుని చంపేశారని తెలుస్తోంది. కాబోయే భార్య సోదరులే కావడంతో అల్తాఫ్ కూడా వారిని నమ్మి వారితో వెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశం కూడా కాకపోడవంతో తనపై దాడి జరిగే అవకాశం లేదని డిసైడ్ అయ్యాడు. కానీ జనసంచారం ఉన్న సమయంలోనే అల్తాఫ్ ని మట్టుబెట్టారు దుర్మార్గులు. కాపాడండి.. అంటూ అతను వేసిన కేకలు ఎవరూ పట్టించుకోలేదు.
Also Read: Hyderabad: మెడపై చిన్న కురుపు.. ఆస్పత్రిలో చికిత్స, వెంటనే యువకుడి మృతి.. ఏం జరిగిందంటే..
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
Kerala Doctor Suicide: BMW కార్ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య
NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్
Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్
SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>