News
News
X

Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!

Man Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య పాప పుట్టిన రెండేళ్లకే చనిపోయింది. పాప కోసం మరో పెళ్లి చేస్కున్నాడు. అయినా ఆమెను మర్చిపోలేక ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. 

FOLLOW US: 

Man Suicide: ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వారు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. అల్లారు ముద్దుగా పాపను పెంచుకుంటూ హాయిగా జీవనం సాగించారు. కానీ పాప పుట్టిన రెండేళ్లకే అతడి భార్య అకాల మరణం చెందింది. ఆమె మృతిని అతడు జీర్ణించుకోలేకపోయాడు. చాలా రోజుల పాటు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నాడు. కానీ అలా ఉంటే పాప ఒంటరి అవుతుందని నీవు మరో పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. తన కోసం కాకపోయినా పాప కోసమైనా పెళ్లి చేసుకోక తప్పదని భావించిన అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 

భార్య గుర్తొచ్చినప్పుడల్లా సమాధి వద్దకు వెళ్లేవాడు..

గత ఏడాది రెండో భార్య కూడా గర్భం దాల్చింది. వీరికి పాప కూడా పుట్టింది. కానీ అతను మాత్రం మొదటి భార్యను మర్చిపోలేకపోతున్నాడు. ఆమె చనిపోయిన నాటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా సమాధి వద్దకు వెళ్లి కాసేపు గడిపి తిరిగొచ్చేవాబు. ఈ మధ్య ఎందుకో తెలియదు, మొదటి భార్య గుర్తుకొచ్చి మరింతగా బాధ పడుతున్నాడు. అది తట్టుకోలేక ఆమె సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘనట స్థానికంగా సంచలనం రేపింది. 

రెండో భార్యకు పాప కూడా పుట్టింది..

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ కు చెందిన 28 ఏళ్ల పుట్ట సురేష్ నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పాప కూడా పుట్టింది. కానీ రెండేళ్లకే భార్య చనిపోయింది. అది తట్టుకోలేని సురేష్ మానసికంగా కుంగిపోయాడు. మరో రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పించి మరో యువతితో వివాహం జరిపించారు. వీరికి కూడా ఒక పాప పుట్టింది. అయినా తన మొదటి భార్యను మరిచిపోలేక తరచూ ఆమె సమాధి వద్దకు వెళ్లి బాధపడుతుండే వాడు. అక్కడే గంటల పాటు కూర్చొని విలపిస్తూ ఉండేవాడు. అది చూసిన ప్రతీ ఒక్కరూ అలా అక్కడకు వెళ్లొద్దు, రెండో భార్య, పిల్లలతో సంతోషంగా గడపమని చాలా చెప్పేవారు. కానీ అతను మొదటి భార్యపై ప్రేమతో సమాధి వద్దకు వెళ్లి కూర్చుంటూ సమయం గడిపేవాడు. 

గాంధీలో చికిత్స పొందతూ మృతి..

ఈ నెల 2వ తేదీన సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీకి సిఫార్సు చేశారు. అయితే సురేష్ అక్కడే చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Also Read: Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Also Read: Bhadradri Kottagudem News : మహిళా సర్పంచ్ పై అత్యాచారయత్నం, అవమానం భరించలేక ఆత్మహత్య!

Published at : 08 Aug 2022 03:13 PM (IST) Tags: telangana latest news Man Suicide Man Committed Suicide Kamareddy Latest Crime News Kamareddy Latest Suicide

సంబంధిత కథనాలు

Krishna News: పామును పట్టేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు

Krishna News: పామును పట్టేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు

Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!

Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!

Crime News: బతుకమ్మ ఆడుతున్న భార్యను చంపిన భర్త, అదే కారణమా? 

Crime News: బతుకమ్మ ఆడుతున్న భార్యను చంపిన భర్త, అదే కారణమా? 

Living With The Dead Body: ఏడాదిన్నరగా ఇంట్లోనే శవం, గంగాజలం తాగిస్తూ బతికించే ప్రయత్నం!

Living With The Dead Body: ఏడాదిన్నరగా ఇంట్లోనే శవం, గంగాజలం తాగిస్తూ బతికించే ప్రయత్నం!

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!