News
News
X

Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Woman Rape: హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలోని బస్తీలో నివసించే అమ్మాయిపై అత్యాచారం చేశాడో సెక్యూరిటీ గార్డు. ఉన్న కాస్త పరిచయంతోనే పని ఉందని ఆమె ఇంటికి వచ్చి.. గదిలో బంధించి మరీ బలాత్కారం చేశాడు. 

FOLLOW US: 

Woman Rape: హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఏదో ఓ చోట రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు మళ్లిన వాళ్ల వరకు ఎవర్నీ వదిలి పెట్టట్లేదు ఈ కామాంధులు. ఇలాంటి కీచకుల మధ్య నేడు ఆడపిల్ల బతకడమే కష్టంగా మారింది. భాగ్య నగరంలోని జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరవకముందే బంజారాహిల్స్ ప్రాంతంలో మరో అఘాయిత్యం జరిగింది. ఓ యువతిని గదిలో బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సెక్యూరిటీ గార్డు. ఈ దారుణ ఘటన ఈనెల 4వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళా సర్పంచ్ పై సైతం అత్యాచారం జరగడం, ఆపై అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. 

అసలేమైందంటే..?

బంజారాహిల్స్ లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ లో పని చేసే చిన్మయి సైక్యా అనే 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. పైకి బాగానే మాట్లాడుతున్నా.. లోపల మాత్రం ఆమెపై విపరీతమైన ఆశ కల్గింది. అది గ్రహించలేని ఆ అమ్మాయి అతడితో స్నేహంగానే ఉండేది. ఈనెల 4వ తేదీన ఏదో పని ఉందని చెబుతూ.. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. యువతిని తన కోరిక తీర్చమని అడిగాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఇది తప్పు అని స్నేహితుడ్ని వారించేందుకు ప్రతయ్నించింది. కానీ ఆమె మాట పట్టించుకోని సెక్యూరిటీ గార్డ్.. ఆమెను గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆపై ఆమె వద్దూ వద్దని ఏడుస్తున్నా వినకుండా అత్యాచారం (Security Guard Rapes Woman) చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో ఇంట్లోనే గదిలోనే ఏడుస్తూ ఉండిపోయింది. 

చనిపోతానంటూ స్నేహితురాలికి మెసేజ్..!

కుటుంబ సభ్యులు వచ్చే సరికి మామూలుగా ఉన్నట్లు నటించింది. తల్లిదండ్రులు ఏమైందని అడిగినా ఏం లేదంటూ గదలికో వెళ్లి తలుపులేస్కుంది. కానీ పదే పదే అతడు చేసిన అఘాయిత్యం గుర్తకు వచ్చి చనిపోవాలనుకుంది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి మెసేజ్ ద్వారా తెలియ జేసింది. వెంటనే అప్రమత్తమైన ఆమె.. విషయాన్ని బాధితురాలి సోదరికి తెలిపింది. నిమిషం కూడా ఆగకుండా ఆమె చెల్లి వద్దకు పరిగెత్తుకెళ్లి ఏమైందని అడిగింది. ముందుగా ఏవేవో చెప్పిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత నిజం చెప్పింది. తనను గదిలో బంధించి మరీ సెక్యూరిటీ గార్డు బలాత్కారం చేసినట్లు వివరించింది. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!

విషయం విన్న తల్లిదండ్రులు వెంటనే పోలీసుల వద్దకు వెళ్లారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేన సమయంలో వచ్చి అభం శుభం తెలియని అమ్మాయిపై అత్యాచారం చేసిన ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Also Read: Chikoti Case : చికోటి కేసినో కేసులో నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు - అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ?

Also Read: Bhadradri Kottagudem News : మహిళా సర్పంచ్ పై అత్యాచారయత్నం, అవమానం భరించలేక ఆత్మహత్య!

Published at : 08 Aug 2022 09:54 AM (IST) Tags: Hyderabad Latest Crime News Woman Rape Security Guard Raped a Woman Hyderabad Latest Rape Case Banjara Hills Rape Case

సంబంధిత కథనాలు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం

YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం

టాప్ స్టోరీస్

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

CUET PG Result:  సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam

Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam