Bhadradri Kottagudem News : మహిళా సర్పంచ్ పై అత్యాచారయత్నం, అవమానం భరించలేక ఆత్మహత్య!
Bhadradri Kottagudem News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోమటిపల్లి గ్రామ సర్పంచ్ పై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనను అవమానంగా భావించిన ఆమె పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.
Bhadradri Kottagudem News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామ సర్పంచ్ పై భూక్యా నవీన్ అత్యాచారయత్నం చేశాడు. ఆగస్ట్ 2న కోమటిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భూక్యా నవీన్ కు గుగులోత్ బుజ్జి అనే వ్యక్తి సహకరించాడు. అయితే ఇది గమనించిన మరో వ్యక్తి సర్పంచ్ భర్తకి ఫోన్ చేశాడు. దీంతో భర్త అక్కడికి వచ్చి భార్యను రక్షించారు. అనంతరం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ వ్యవహారంపై సర్పంచ్ తన పరువు పోయిందనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ సర్పంచ్ గురువారం మృతి చెందింది. సర్పంచ్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన నవీన్, అతనికి సహకరించిన బుజ్జి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సర్పంచ్ పై 11 మంది అత్యాచారయత్నం
ఏపీలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళా సర్పంచ్ పై 11 మంది అత్యాచారయత్నం చేశారు. స్థానికుల స్పందించడంతో ఆమె అక్కడి నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరంలో మహిళా సర్పంచిపై 11 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో ఉండగా బుధవారం పి.రమణబాబు, పి.సుధాకర్, పి.మధు, జగదీష్, భద్రరావు, ఎల్.సురేష్‌కుమార్, ఎ.శ్రీనివాసరావు, ఎల్.వెంకటరాజు, పి.ప్రసాద్, సోమశేఖర్, పి.శ్రీనివాసరావు తనపై లైంగికదాడికి యత్నించారని మహిళ ఆరోపించింది. తాను ప్రతిఘటించే యత్నం చేయడంతో చంపాలని చూశారని ఫిర్యాదు చేసింది. దీంతో మెడభాగం, పొత్తి కడుపు, ఇతర అవయవాలపై దాడిచేసి చిత్రహింసలకు గురిచేశారని మహిళ వెల్లడించింది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో నిందితులు పారిపోయారని చెప్పారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్థానికులను ఆరా తీసినట్లు ఎస్సై శ్యామలాదేవి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.
Also Read : Lady Constable Protest: మహిళా పోలీసుకే తప్పని లైంగిక వేధింపులు, ఎక్కడంటే?