(Source: Poll of Polls)
Lady Constable Protest: మహిళా పోలీసుకే తప్పని లైంగిక వేధింపులు, ఎక్కడంటే?
Harrasment of Lady Constable: పల్నాడు జిల్లాలోని ఓ గ్రామంలో మహిళా పోలీసుపైనే లైగింక వేధింపులకు పాల్పడుతున్నారు ఓ ఇద్దరు వ్యక్తులు. అది తట్టుకోలేని ఆమె సచివాలయం ఎదుట ధర్నాకి దిగింది.
Harrasment of Lady Constable: ఎవరికైనా ఎదైనా సమస్య వస్తే మొదట గుర్తుకు వచ్చేది పోలీసు. తమకు ఎదురైనా సమస్యలు వారికి చెబుతారు. ఆ సమస్య నుండి తమను బయటకు తీసుకువస్తారని, ఆ సమస్యను పరిష్కరిస్తారాని సాధారణ జనం భావిస్తారు, నమ్ముతారు. ఏదైనా గొడవ జరిగినా మొదట పరుగెత్తేది పోలీసుల వద్దకే. వారు గొడవలో అమాయకుల పక్షాన, ధర్మం పక్షాన నిలబడి న్యాయం చేస్తారని అనుకుంటారు. సమస్య చిన్నది అయినా, లేదా పెద్దది అయినా పరుగెత్తేది మాత్రం పోలీస్ స్టేషన్ కే. ఇంట్లో దొంగతనం జరిగినా, హత్య, ఆత్మహత్య, ప్రమాదం ఏది జరిగినా మొదట ఫోన్ వెళ్లేది పోలీసుకే. ఎందుకంటే అక్కడ న్యాయం జరుగుతుందని, పోలీసులు న్యాయం చేస్తారని సామాన్యులు భావిస్తారు. లైంగిక వేధింపుల లాంటి పెద్ద కేసుల్లో అయితే పోలీస్ స్టేషనే రక్షణ కల్పించే దేవాలయంగా చూస్తారు బాధితులు. తమకు న్యాయం జరగకపోతుందా అని భావిస్తారు.
పోలీసుకే లైంగిక వేధింపులు..
సామాన్యులకు సమస్య వస్తే పోలీసు స్టేషన్ కు పరిగెడతారు. మరి పోలీసుకే సమస్య వస్తే ఏం చేస్తారు.. లెక్క ప్రకారం వారు కూడా పోలీసు స్టేషన్ కే వెళ్లాలి. అక్కడ సాధారణ వ్యక్తుల్లాగే ఫిర్యాదు చేయాలి. అసలు సమస్య ఏమిటో చెప్పాలి. కానీ పోలీసు స్టేషన్ లో న్యాయం జరగదని తెలిస్తే ఏం చేస్తారు. సాధారణ వ్యక్తుల్లాగే వాళ్లు కూడా రోడ్డు ఎక్కాల్సిందే. నడి రోడ్డుపై బైటాయించి న్యాయం కావాలంటూ ఆందోళన చేయాల్సిందే. అదే జరిగింది పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం యల్లమందలో. షేక్ హసీనా అనే మహిళా పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావు అనే వ్యక్తులు మద్యం తాగి షేక్ హసీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా పోలీసు అని కూడా చూడకుండా మద్యం మత్తులో వేధించారు.
పోలీస్ స్టేషన్ లో పోలీసు ఫిర్యాదు..
తనపై ఇద్దరు వ్యక్తులు వేధింపులకు దిగడంతో మహిళా పోలీసు షేక్ హసీనా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యల్లమంద గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులు తనను వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు షేక్ హసీనా. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరూ మరింతగా రెచ్చి పోయారు. మాపైనే కంప్లైంట్ ఇస్తావా అంటూ మరో సారి వేధింపులకు దిగారు. మద్యం సేవించి మత్తులో తూగుతూ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో మహిళా పోలీసు షేక్ హసీనాను వేధించారు. తర్వాత చేతలతోనూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తాను ఓ మహిళా పోలీసు అని తెలిసినా వేధింపులకు దిగడంపై హసీనా.. ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు.
సచివాలయం ఎదుట మహిళా పోలీసు ధర్నా..
పోలీసునే వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, కంప్లైంట్ చేస్తే వారి వేధింపులు మరింత పెరగడంతో మహిళా పోలీసు షేక్ హసీనా రోడ్డుపై బైటాయించారు. కుటుంబ సభ్యులతో కలిసి నడి రోడ్డుపై కూర్చుని ధర్నా చేశారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తనను వేధించిన యల్లమంద గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులను శిక్షించాలని కోరారు. తన చెల్లి షేక్ హసీనాపై వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని బాధిత మహిళ సోదరుడు డిమాండ్ చేశారు. స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులకు కొందరు సచివాలయ సిబ్బంది మద్దతు ఇస్తున్నారని షేక హసీనా సోదరుడు ఆరోపించారు.