Atmakur News: ఆత్మకూరులో హైటెన్షన్... ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ... బీజేపీ నేత కారుపై దాడి
కర్నూలు జిల్లా ఆత్మకూరులో హైటెన్షన్ నెలకొంది. ఓ నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో బీజేపీ నేత వాహనంపై ఓ వర్గం దాడిచేశారు. ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి స్కూల్ వెనకాల ఓ నిర్మాణం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో శ్రీశైలం నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ఓ వర్గం అడ్డుకుంది. ఆయన వాహనాన్ని వేగంగా పోనివ్వడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆత్మకూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం ఆయన్ను పోలీసు స్టేషన్ లో దిగ్బంధించి దాడి చేశారు. ఈ దాడిలో ఆయన గాయపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
Also Read: ప్రభుత్వ పథకాలు కావాలంటే నా కోరిక తీర్చాలి... వెలుగులోకి మరో కాలకేయుడి ఆగడాలు
ఈ ఘటనపై డీజీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన జారీ అయింది. ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ అన్నారు. వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆత్మకూరు సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సినదిగా జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
కర్నూలు జిల్లా ఆత్మకూర్ పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న నిర్మాణాలను ప్రజలతో కలసి ప్రశ్నించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి , జై చంద్రల పై హత్యాయత్నాన్ని రాష్ట్ర బీజేపీ త్రీవ్రంగా (1/2) pic.twitter.com/kbB4M1ZGNY
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 8, 2022
Also Read: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట..
ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో అక్రమంగా నిర్వహిస్తున్న నిర్మాణాలను ప్రజలతో కలసి అడ్డుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి, జై చంద్రలపై హత్యాయత్నం చేశారన్నారు. ఈ చర్యను రాష్ట్ర బీజేపీ త్రీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజలపైన రాళ్ల దాడి చేయడమే కాకుండా పోలీసుల సమక్షంలో నేతల వాహనాలను ధ్వంసం చేయశారన్నారు. ఈ సంఘటనకు కారులైన వారిపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని బాధితులకు రక్షణ కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి