Khammam: బతుకుదెరువు కోసం వచ్చి మృత్యుఒడికి... సాగర్ ఎడమ కాలువలో ముగ్గురు గల్లంతు
ఖమ్మం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి కోత మిషన్ తీసుకొచ్చిన ముగ్గురు ఆపరేటర్లు కట్టకూరు గ్రామంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామంలో ముగ్గురు గల్లంతయ్యారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన వ్యక్తులు కాలువలో కొట్టుకుపోవడంతో వారి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సొంత ఊళ్లలో పనులు దొరక్క ఏదో పనిచేసుకుందామని వచ్చిన వారికి ఇలా జరగడంపై స్థానికంగా విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు వద్ద ఎన్.ఎస్.పి. కాలవలో పడి పంజాబ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వరి కోత మిషన్ తో వరి పొలాలను కోసేందుకు మేడేపల్లి గ్రామానికి వచ్చిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన మణి, సాజన్, గమి అనే ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. ఒక వ్యక్తి కాలవలో జారిపడటంతో అతన్ని కాపాడబోయిన మరో ఇద్దరు కాలువ ప్రవాహం కొట్టుకుపోయారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాలువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
కోత మిషన్ ఆపరేటర్లు కాలువలో గల్లంతు
ఖమ్మం జిల్లాలో పెను విషాదం జరిగింది. బతుకుదెరువు కోసం పంజాబ్ నుంచి ఖమ్మం వచ్చిన ముగ్గురు వలస కూలీలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. జిల్లాలోని ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ (మంగాపురం మేజర్ కెనాల్) లో పడి ముగ్గురు వలస కూలీలు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గమి(30), సాజన్(19), మణి(29) అనే ముగ్గురు కట్టకూరులో వరి చేలు కోసేందుకు కోత మిషన్ తీసుకొచ్చారు. వరి కోత యంత్రం ఆపరేటర్లుగా పని చేస్తున్న వీళ్లు... సోమవారం రాత్రి కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. మంగళవారం ఉదయం కాలువ వైపు వెళ్లిన స్థానికులు గట్టుమీద బైకు, చెప్పులు ఉండటంతో గమనించి ఎవరైనా కాలువలో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించారు. పంజాబ్ రాష్ర్టానికి చెందిన వరికోత మిషన్ ఆపరేటర్లు గల్లంతైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు మృతదేహాలు లభించలేదని పోలీసులు తెలిపారు. పక్క మండలాల అధికారులకు సమాచారం అందించామని ముదిగొండ ఎస్ఐ తోట నాగరాజు పేర్కొన్నారు.
Also Read: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి