Nizamabad: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం
నిజామాబాద్ జిల్లా బోధన్ లో వీఆర్ఏ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఇసుక మాఫియానే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామంలో వీఆర్ఏ గౌతమ్ మృతి సంచలనంగా మారింది. ఇసుక మాఫియా కారణంగానే గౌతమ్ మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. బోధన్ పోలీసు స్టేషన్‌ను ముచ్చటించారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు గౌతమ్‌ను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇసుకకు సంబంధించిన గొడవలే గౌతమ్ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకొని న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.
బోధన్ మండలం ఖండ్‌గావ్‌కు చెందిన గౌతమ్ వీఆర్ఏగా పని చేస్తున్నాడు. బోధన్ మండలం గోదావరి పరివాహకంలో ఇసుక క్వారీలు ఎక్కువగా ఉన్నాయి. అక్రమాలను అడ్డుకుంటున్న గౌతమ్‌ను ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న గౌత ను ముగ్గురు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. తీసుకెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కొట్టి చంపారని చెబుతున్నారు.
బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ గౌతమ్ మృతిని అనుమానాస్పద మృతిగా కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇసుక మాఫియా వల్ల చనిపోయారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఏమీ లేవని తెలిపారు.
గౌతమ్ వ్యక్తిగత కారణాల వల్ల బయటకు వెళ్లారని... అక్కడ గొడవ జరిగిందన్నారు పోలీసులు. అతను ఇసుకకు సంబంధించిన డ్యూటీలో కూడా లేరని రెవెన్యూ అధికారులు తేల్చారు. కేసును అన్ని విధాలుగా విచారిస్తామని... ఇంతలో పుకార్లు సృష్టించవద్దన్నారు. గ్రామంలో కూడా ప్రత్యక్ష సాక్షులను విచారిస్తాని పేర్కొన్నారు. ఏం జరిగిందన్నదానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాత వివరాలు వెళ్లాడిస్తామన్నారు బోదన్ రూరల్ సీఐ రవీందర్.
దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ చేరుకొని గౌతమ్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చెయాలని డిమాండ్ చేశారు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి