By: ABP Desam | Updated at : 24 Jan 2022 02:51 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పాపమ్మ, సుధీర్(ఫైల్ ఫొటోస్)
అర్ధరాత్రి వ్యాయామం చేస్తుండగా తల్లి మందలించిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తుండగా తల్లి మందలించడంతో రాడ్ తో తల్లి తలపై కొట్టిన హత్య చేశాడు కొడుకు సుధీర్. అడ్డు వచ్చిన చెల్లని కూడా రాడ్ తో కొట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే తల్లి పాపమ్మ మృతి చెందింది. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. గతకొన్ని రోజులుగా సుధీర్ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండడంలేదని పోలీసులు గుర్తించారు. సుధీర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చికిత్స కోసం నిందితుడిని ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని బాలుడు పోస్టు
ఆత్మహత్యకు అనుమతించాలని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఓ బాలుడు అధికారులు, పాలకులను వేడుకుంటూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జి.జగదీశ్‌రెడ్డి, ఖమ్మం, సూర్యాపేట కలెక్టర్లకు బాలుడు ఈ పోస్టులు పెట్టాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చేరే వరకు దీన్ని షేర్ చేయాలని కోరాడు. బాలుడి తల్లి నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ గతేడాది కోవిడ్ బారిన పడి చనిపోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. అప్పటి నుంచి బాలుడు తన అక్క వద్ద ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం పాల్వంచలోని తన బంధువుల వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత నేలకొండపల్లి తిరిగి వచ్చి అద్దెకు ఇళ్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. తన అక్క, బావ సరైన వైద్యం ఇప్పించకుండా తల్లి మరణానికి కారణమయ్యారని బాలుడు ఆరోపిస్తు్న్నాడు. తల్లి ఉద్యోగం అక్కకు రావాలనే ఉద్దేశంతో తనను కూడా చంపాలని చూస్తున్నారని అంటున్నాడు. ఈ ఆరోపణలను నిజం కాదని అతని అక్క ఓ ప్రకటన విడుదల చేశారు. కావాలనే కొందరు తన తమ్ముణ్ని అడ్డు పెట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన తమ్ముడి పోస్టుపై హుజూర్‌నగర్, నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది.
Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు సజీవదహనం
Witchcraft Woman Death: సొంత సోదరిని బలిచ్చిన యువతి! నాలుక కోసి, పేగులు గర్భాశయం బయటికి తీసి ఘోరం!
Vikarabad Family Missing: వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం - భార్య ఆచూకీ దొరకడం లేదని భర్త, కుమార్తెలు అజ్ఞాతంలోకి
Hyderabad Crime : ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన యువకుడు, రెండేళ్లు సహజీవనం చేసి పరార్!
Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?
CM Jagan: సెప్టెంబరులోపు పిల్లలకి ఫ్రీగా ట్యాబ్‌లు, అమ్మఒడి అందుకే కొందరికి రాలేదు: సీఎం జగన్
ED summons Sanjay Raut: రాజకీయ సమస్యల్లో ఉన్న శివ్‌సేనకు మరో ఝలక్- విచారణకు రావాలంటూ ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
Killi Kruparani: కిల్లి కృపారాణికి ఘోర పరాభవం! కాసేపట్లో సీఎం జగన్ పర్యటన, ఇంతలో అలిగి వెళ్లిపోయిన నేత
Ranga Ranga Vaibhavanga Teaser: చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ ఒక్క టీజర్లో చూపించిన వైష్ణవ్ తేజ్