By: ABP Desam | Updated at : 23 Jan 2022 10:21 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
కానిస్టేబుల్ తో గొడవపడుతున్న యువకుడు
హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించిన పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. స్థానికులు కలుగజేసుకుని ఆపివేయడంతో గొడవ సద్దుమణిగింది. దాడికి దిగిన యువకుడి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసు డిపార్ట్మెంట్ చెందిన వారు కాబట్టే యువకుడు ఇలా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు.
కరీంనగర్ నగరంలో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నావ్ అన్నందుకు ఓ యువకుడు కానిస్టేబుల్ పై దాడి చేశాడు. నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నాడు. ఓ కానిస్టేబుల్ హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావంటూ అతడిని ప్రశ్నించాడు. నా ఇష్టం నీవెవరు చెప్పడానికంటూ సదరు యువకుడు పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. చుట్టుపక్కల వాళ్లంతా యువకుడిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా కానిస్టేబుల్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇరువురిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరికి సర్ధిచెప్పారు. దాడి చేసిన వ్యక్తి ఓ పోలీసు అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెపుతున్నారు.
Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
హెల్మెట్ ధరించడం తప్పనిసరి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా తగ్గేదే లే అంటూ పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెటర్లు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే వాళ్లు పుష్ప సినిమాలోని తగ్గేదే లే, అల్లు అర్జున్ స్టెప్పులతో రీల్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా పుష్పరాజ్‌ను హెల్మెట్ అవగాహనకు వాడేశారు. వివిధ సినిమాల్లోని డైలాగులు, పాటలతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ట్రాఫిక్ పోలీసులు... తాజాగా పుష్పరాజ్ పోస్టు పెట్టారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెబుతూ పుష్ప సినిమాలో బైక్‌పై వెళ్లే బన్నీ ఫొటోకు హెల్మెట్ పెట్టి మార్ఫింగ్ చేశారు. ఆ ఫొటోపై హెల్మెట్ తప్పనిసరి తగ్గేదే లే అని క్యాప్షన్ కూడా రాశారు. ఈ పోస్టు సోషల్ మీడియో వైరల్ అయింది. హెల్మెట్ ధరించండి అది మిమ్మల్ని కాపాడుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ట్రెండింగ్ లో ఉన్న సినిమా డైలాగులతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి వెళ్తుందన్న ఉద్దేశంతోనే పోలీసులు ఇలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.
Also Read: రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు.. సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు !
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!