Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
![Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు Weather In Andhra Pradesh Telangana Hyderabad on 23 January 2022; AP Rain Updates Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/da3979d4b12d27e4ddb4384124494c65_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాల ప్రభావంతో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ఈశాన్య రుతుపవనాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు ఏపీలో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారుతుంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అకాల వర్షాలు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 19.4 డిగ్రీలు, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీల మేరకు పడిపోవడంతో చలి తీవ్రత అధికమైంది.
వాయువ్య గాలు ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు, మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురనుండగా... కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం మరింతగా పెరుగుతోంది. ఆరోగ్యవరంలో 14.5 డిగ్రీలు, అనంతపురంలో 15.9 డిగ్రీలు, నంద్యాలలో 17.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు..
ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు కురవనున్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కనిష్ట ఉష్ణోగ్రత 15 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
Also Read: Kottagudem: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)