అన్వేషించండి

Kottagudem: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్‌

కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర రిమాండ్ ను కోర్టు పొడిగింది. ఫిబ్రవరి 4 వరకు రిమాండ్ గడువు పొడిగిస్తున్నట్లు స్థానిక కోర్టు తెలిపింది.

భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు స్థానిక కోర్టు రిమాండ్‌ పొడిగించింది. మరో 14 రోజులు రిమాండ్ గడువు పెండింది.  ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు కోర్టులో వర్చువల్‌గా రాఘవను హాజరుపరిచారు. కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ గడువు పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాఘవ బెదిరింపులకు తట్టుకోలేక నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఒక్కసారిగా రాఘవ అరాచకాలపై అందరి దృష్టి పడింది. మీడియాతోపాటు సామాజిక మాద్యమాల్లో రాఘవ నేరాకృత్యాలపై విమర్శలు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. రాఘవకు సంబంధించిన కేసులపై దృష్టి సారించారు. పెండింగ్‌ కేసుల విచారణ వేగవంతం చేశారు. ఈ మేరకు పాల్వంచ ఏఎస్సీ, ఐపీఎస్‌ అధికారి రోహిత్‌ రాజ్‌ రాఘవపై 12 కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, అతనిపై రౌడీషీట్‌ నమోదు చేస్తామని ప్రకటించారు.

Also Read: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్‌

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య

జనవరి 3వ తేదీన పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఇద్దరు చిన్నారులు, భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద కుమార్తె సాహితీ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. రామకృష్ణ బావమరిది జనార్దన్‌ ఫిర్యాదుతో పాల్వంచ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. 

గతంలో నమోదైన కేసులపై కూడా విచారణ

అయితే ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవపై ఆరోపణలు చేశారు. తన ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర ఉన్నాయని వీడియోలో చెప్పారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సూసైడ్ ఘటన బయటకు రాగానే వనమా రాఘవ పరారీలో ఉన్నాడు. అతడి కోసం 8 ప్రత్యేక బృందాలను గాలించాయి. వనమా రాఘవను దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశారు. ఈ కేసులో బాధితుల నుంచి లభించిన ఆధారాలను సీజ్‌ చేసి కోర్టుకు సమర్పించారు. 

Also Read: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
Embed widget