News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Social Media Arrest : రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు.. సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు !

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టారన్న కారణంగా అరెస్టయిన జనసేన అభిమానిపై ఏపీ పోలీసులు రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం అనే కేసులు పెట్టారు. కోర్టు కొట్టేసి బెయిల్ మంజూరు చేసింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని మానవబాంబుగా మారి చంపేస్తానని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టి తీసేసిన జనసేన సానుభూతి పరుడు ఫణికి గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఫణిపై రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం చేయడం వంటి కేసులు పెట్టారు. ఆ సెక్షన్లు పెట్టడానికి ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. డిలీట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తప్ప మరేమీ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడ్ని జైల్లో ఉంచేందుకు ఈ సెక్షన్లు పెట్టారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్టును తరిస్కరించి.. బెయిల్ మంజూరు చేశారు.

Also Read: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య

రాజమండ్రికి చెందిన పవన్ ఫణి.. హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాయి. జనసేనపై అభిమానంతో టీడీపీ, వైసీపీపై ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపేస్తానని పోస్టు పెట్టి.. కాసేపటికి తీసేశాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశారు. అయితే  అయితే సైబర్ క్రైం పోలీసులు మాత్రం వెంటపడి పట్టుకుని రాజద్రోహం.. ప్రభుత్వంపై యుద్ధం కేసులు పెట్టారు. శుక్రవారం అరెస్ట్ చూపించారు. శనివారం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
  
అయితే ఫణితో తమ పార్టీకి సంబంధం లేదని జనసేన ప్రకటించింది. సోషల‌్ మీడియాలో  దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించమని జనసేన మీడియా విభాగం తెలిపింది. సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అభిమాని ముసుగులో పోస్టులు చేసేవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవ, విశ్లేషణాత్మక, చైతన్యపరిచేలా పోస్టులు ఉండాలని చెప్పింది.

Also Read: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గత రెండున్నరేళ్లలో  కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి ఉంటారు. వారిలో చాలా మందికి సంబంధించిన కంప్యూటర్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఇతరులపై దారుణమైన న్యాఖ్యలు చేసినా.. వాటిపై ఫిర్యాదులు అందినా.. చివరికి న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏపీ పోలీసులు పట్టించుకోరన్న విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. 
Published at : 22 Jan 2022 08:27 PM (IST) Tags: pawan kalyan social media janasena AP Cm Jagan Tweet on Jagan Janasena Fan Phani Janasena Social Media

ఇవి కూడా చూడండి

AP High Court : కోర్టు ధిక్కరణ - ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు హైకోర్టు నెల రోజుల శిక్ష !

AP High Court : కోర్టు ధిక్కరణ - ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు హైకోర్టు నెల రోజుల శిక్ష !

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా

Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Chandrababu case :  రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ -  చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

టాప్ స్టోరీస్

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు