Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...
ప్రేమలో పడటం సరదాగా తిరగడం బాగానే ఉంటుంది. కానీ అందులో ఉండే ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. అలా డేంజర్‌ను పసిగట్టలేని ఓ ప్రేమ జంట చిక్కుల్లో పడింది.
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన యువతీ యువకుడు ప్రేమలో పడ్డారు.. ఒకే ఊరు కావడం అందులోనూ ఒకే కళశాలలో డిగ్రీ చదువుతున్న వారిద్దరూ గత కొంత కాలంగా ఒకరినొకరు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. చదువు పూర్తైన తర్వాత ప్రేమ సంగతి పెద్దలకు చెబుతామనుకున్నారు.
ఇదే ధీమాతో ఇద్దరూ తెగ తిరిగేశారు. ఎక్కడ చూసిన వాళ్లే. సెలవు దొరికితే చాలు సినిమాలు షికార్లు. ఎన్నో మరుపురాని సంఘటనలు వారి జీవితాల్లో ఉన్నాయి. అందులో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంటుందని వాళ్లు ఎప్పుడూ ఊహించలేదు.
పది రోజుల క్రితం ఎప్పటిలాగానే వాళ్లిద్దరూ పీలేరు శివారు ప్రాంతానికి వెళ్లారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న టైంలో ఓ ఆకతాయి ముఠా అక్కడికి వచ్చింది. అక్కడ ఎవరూ లేరని గ్రహించిన ఆ ముగ్గురు ఆకతాయిలు రెచ్చిపోయారు. వీళ్లిద్దరూ ఏకంతంగా ఉన్నటైంలో ఫొటోలు తీశారు.
ఆకతాయిల వికృత చేష్టలు ఆలస్యంగా గ్రహించిన ఆ ప్రేమ జంట ఎవరు మీరు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించింది. ఫుల్లుగా తాగి ఉన్న ఆ ఆకతాయిలు ఆ లవ్ కపుల్‌ను బెదిరించారు. తమ సంగతి పక్క పెట్టి మీరెవరు ఇక్కడేం చేస్తున్నారని తిరిగి దబాయించారు.
ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు తీశామని... సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు ఆకతాయిలు. భయపడిపోయిన ఆ ప్రేమికులు ఆ ఫోటోలు డిలీట్ చేయాలని వేడుకున్నారు. అయితే తమకు మద్యం తీసుకొస్తే వదిలేస్తామని నమ్మబలికారు. వారి మాయ మాటలు నమ్మిన యువకుడు మద్యం బాటిల్ తీసుకొచ్చాడు.
ఆ యువకుడు మద్యం బాటిల్ తీసుకొచ్చే లోపు ఆ రౌడీ బ్యాచ్ చేయాల్సిన ఘోరం చేసేసింది. ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసింది. ఆ యువతిని చిత్రవధ చేసి అక్కడే వదిలేసి పారిపోయారు.
మద్యం బాటిల్‌తో తిరిగొచ్చిన యువకుడితో జరిగింది చెప్పుకొని బోరుమందా బాధితురాలు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్న జరిగిన దుర్ఘటన మర్చిపోలేకపోయిందా యువతి. ఎవరికీ చెప్పుకోలేక.. విషయాన్ని మర్చిపోలేక ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యపై కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా యువతి చెప్పిన విషయాలు విని షాక్ తిన్నారు. అత్యాచారంపై కేసు పెట్టి విచారిస్తామన్నారు. పోలీసుల ప్రయత్నాన్ని యువతి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. తమకు ఎటువంటి న్యాయం అవసరం లేదని, పరువు తీయొద్దని వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయలేదు కానీ విషయాన్ని మాత్రం ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఈ ఘటనలో నిందితులను మాత్రం వదిలి పెట్టొద్దని కేసును సీక్రెట్‌గా ఎంక్వయిరీ చేయాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. పీలేరు శివారు ప్రాంతాంలో ఉన్న పలువురుని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. యువతిపై అఘాయిత్యానితి పాల్పడిన ఆకతాయిల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.