IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు

AP Weather Updates: అకాల వర్షాలు తగ్గినా ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి.

FOLLOW US: 

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇటీవల కొన్ని రోజులపాటు వర్షాలు కురవడమే అందుకు కారణం. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత తగ్గడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఉత్తర దిశ నుంచి బలమైన గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. తెలంగాణలో అకాల వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్, పలు జిల్లాల్లో చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది.

ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలు తగ్గడంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందనక్కర్లేదని సూచించారు. కళింగపట్నం, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది. 

రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం తగ్గినట్లు కనిపించడం లేదు. ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. 

Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య

Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Jan 2022 06:48 AM (IST) Tags: telangana rains hyderabad rains telangana rains rains in telangana Weather Updates ap rains rains in ap ap weather updates telangana weather updates AP Temperature Today Telangana Temperature Today

సంబంధిత కథనాలు

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే

Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Cobra at Alipiri: అలిపిరి నడక మార్గంలో నాగుపాము ప్రత్యక్షం - వెంటనే భక్తులు ఏం చేశారో తెలుసా !

Cobra at Alipiri: అలిపిరి నడక మార్గంలో నాగుపాము ప్రత్యక్షం - వెంటనే భక్తులు ఏం చేశారో తెలుసా !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!