అన్వేషించండి

BTech Student Suicide: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

NIT Student Suicide: ఆన్‌లైన్ క్లాసులతో కెరీర్ ఎలా ఉంటుందో తెలియక కొందరు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

NIT Student Suicide: కరోనా వైరస్ మహమ్మారి ప్రత్యక్షంగా కొందరు విద్యార్థుల్ని బలిగొంది. పరోక్షంగానూ కొందరు విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. ఆన్‌లైన్ క్లాసులతో కెరీర్ ఎలా ఉంటుందో తెలియక కొందరు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బలవన్మరణం చెందుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జంగారెడ్డిగూడెనికి చెందిన ఆదూరి శ్రీనివాస్‌ మైసన్నగూడెం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు ఆదూరి ప్రమోద్‌కుమార్‌(20) తెలంగాణ, వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ ఆఖరి సంవత్సరం ఈఈఈ చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండే వాడు.  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్లుగా ఇంటి నుంచే ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. రెండేళ్లుగా ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్ క్లాసులు, మెయిల్స్, రికార్డులు పూర్తి చేయడం జరుగుతోంది. ఆన్‌లైన్ క్లాసులు, జీవితం యాంత్రికంగా మారిపోయిందంటూ ఒత్తిడికి గురైన బీటెక్ స్టూడెండ్ ప్రమోద్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.

ఇంట్లో తన గదిలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమోద్. కుమారుడి గది తలుపులు తెరిచి చూసిన తల్లి అరుణ షాకయ్యారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తమను సంతోషంగా చూసుకుంటాడని భావించిన కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నీకు ఏం కష్టం వచ్చింది కన్నా అంటూ కుమారుడి మృతదేహంపై పడి తల్లి అరుణ రోదించడం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. విద్యార్థి ప్రమోద్ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

కరోనా వల్ల ఎన్‌ఐటీ తెరవడం లేదని, రెండేళ్లు ఇంటికి పరిమితం కావడం, ఆన్‌లైన్‌లోనే క్లాసులు, చదువు కావడంతో ఒత్తిడికి గురయ్యాడు. వీటితో పలు మరికొన్ని విషయాలు తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి ప్రమోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రాజెక్టు వర్క్‌లోనూ ‘ఏప్లస్‌’ గ్రేడ్ సాధించిన కుమారుడు అనూహ్యంగా బలవన్మరణం చెందడాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. త్వరలో జరగనున్న గేట్ పరీక్షలకు సైతం బాగా ప్రిపేర్ అయ్యాడని చెబుతూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు

Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Nagole Missing Boys: అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
‌Fake Currency Racket: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Embed widget