Hyderabad: కేపీహెచ్‌బీలో విషాదం... సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు.
హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ 4వ ఫేజ్ లో సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో గుంత వైపు ఆదుకోవడానికి ఐదుగురు పిల్లలు వెళ్లారు. ముందుగా ఒకరు గుంతలో దిగింది. ఆ బాలిక మునిగిపోతుంటే కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుల తల్లిదండ్రులు హైదరాబాద్ కు వలస వచ్చి కేపీహెచ్‌బీ ఉంటూ పనులుచేసుకుంటారు. విషయం తెలిసి చిన్నారులు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను బయటకు వెలికి తీశారు.
Also Read: తాగుబోతు మొగుణ్ని భరించలేక పుట్టింటికెళ్లిన భార్య.. అత్తపై కేసు పెట్టాలని సెల్‌టవర్ ఎక్కిన భర్త
బాలికల మృతదేహాలు గాంధీకి తరలింపు
ఈ ప్రమాదంలో సంగీత(12), రమ్య(7), సోఫియా(12) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోఫియా, సంగీత రమ్య మృత దేహాలు వెలికితీశారు. బాలికల మృతదేహాలను పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే గుంతలో పడి గతంలో ఇద్దరు బాలురు మృతి చెందినట్లు తెలిస్తోంది. హౌస్సింగ్ బోర్డు, ఓ ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ గుంత తవ్వినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం
కేపీహెచ్‌బీ ఫేజ్-4లో ఆడుకుంటూ సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్లార్ గుంతల్లో బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. భారీ సెల్లార్ గుంత తవ్వడంతో చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడినట్లు తెలుస్తోంది. గుంతలో లోతుగా నీళ్లు ఉండటంతో బాలికలు ఊపిరాడక చనిపోయారు. గుంత తవ్వి వదిలేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి