News
News
X

Chittore: తాగుబోతు మొగుణ్ని భరించలేక పుట్టింటికెళ్లిన భార్య.. అత్తపై కేసు పెట్టాలని సెల్‌టవర్‌ ఎక్కిన భర్త

భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య. బతిమిలాడి భార్యను కాపురానికి తెచ్చుకోవడానికి అత్తారింటికి వెళ్లాడా భర్త. సీన్ కట్ చేస్తే భార్యభర్త ఇద్దరూ కలిసి అత్తపైనే కేసు పెట్టారు.

FOLLOW US: 
Share:

పెళ్లి అనేది చాలా మంది జీవితాలకు ఓ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మాత్రం ఫోకస్‌తో జీవించాల్సి ఉంటుంది. భార్యభర్త ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. అప్పటి వరకు ఎలాంటి సిత్రాలు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరించే పెద్దలు... వివాహం తర్వాత మాత్రం ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. దారి తప్పుతున్నారంటే సరైన దారిలో పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి కట్టడితోనే ఓ భర్త చిక్కుల్లో పడ్డాడు. 

చిత్తూరు జిల్లా చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిసై భార్యబిడ్డలను పట్టించుకోవడం లేదు. దీన్ని గమనించిన అత్తింటి వారు కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితి నచ్చని అతను అత్తపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించాడు. 

Also Read: Cheating Relationship : చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని రాజీవ్ నగర్‌లో కాంత్రి, ప్రమీలకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. ఓ కుమార్తె కూడా ఉంది. పెయింటర్‌గా పని చేస్తున్న క్రాంతి మద్యానికి బానిసయ్యాడు. వచ్చిన సంపాదనంతా తాగుడికే ఖర్చు పెట్టేసేవాడు.  రోజూ ఇంటికి వచ్చి భార్యను కొట్టే వాడు. వివిధ రకాలుగా వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేని ప్రమీల... జరిగిన సంగతి తల్లికి చెప్పింది. ప్లేస్‌ మారితే క్రాంతి ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించిన ఆ అత్త... ఇద్దర్నీ తన ఇంటికి రమ్మని చెప్పింది. 

అత్తారింటికి వచ్చిన క్రాంతి... తన తాగుడు మాత్రం మానలేదు. అతనితో మద్యం మాన్పించేందుకు భార్య, అత్త, బావమర్దులు ఎంతగానే ప్రయత్నించారు. చివరకు అందరి నుంచి ఒత్తిడి పెరిగే సరికి వెనక్కి తగ్గిన క్రాంతి... తాగుడు మానేస్తున్నట్టు చెప్పాడు. కొన్ని రోజులు మద్యానికి దూరంగా కూడా ఉన్నాడు. పరిస్థితి చక్కబడిందని భావించిన అత్తంటి వారు క్రాంతిని, ప్రమిలను వాళ్ల ఇంటికి పంపించేశారు.  

కొన్ని రోజులు మద్యానికి దూరంగా ఉంటూ భార్య బిడ్డను ప్రేమగా చూసుకున్నాడు. ఉన్నట్టుండి మళ్లీ క్రాంతిలో మార్పు వచ్చింది. రోజూ మళ్లీ తాగి వచ్చి భార్యను కొట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో ప్రమీల అతన్ని నిలదీసింది. మళ్లీ ఎందుకు తాగుతున్నావని మండిపడింది. తననే ప్రశ్నిస్తావా అంటూ దాడి చేశాడు క్రాంతి. రోజూ ఈ వేధింపుతు తాను భరించలేనంటూ కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది భార్య ప్రమీల. 

పుట్టింటికి వెళ్లిపోయిన ప్రమీల కోపం తగ్గిన తర్వాత తిరిగి వస్తుందని ఎదురు చూశాడు క్రాంతి. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోయేసరికి అతనే తన అత్తారింటికి వెళ్లి ప్రమీలను పంపించాలని వేడుకున్నాడు. తాగుడు మానేంతవరకు ప్రమీలను పంపించేది లేదని అత్త తేల్చి చెప్పేసింది. అక్కడే కోపంతో ఊగిపోయిన క్రాంతి అత్త, బావమర్దితో గొడవ పడ్డాడు. అక్కడి నుంచి తన ఇంటికి తిరికి వచ్చేశాడు. ఇరుగు పొరుగు వారితో  ఫోన్‌లు చేయించాడు. ప్రమీల వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె పంపించేది లేదన్నారు అత్త. 

వేడుకుంటే పని కాదని గ్రహించిన క్రాంతి... బెదిరింపులకు తెగబడ్డాడు. మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రాంతిని సెల్ టవర్ పై నుంచి దించే ప్రయత్నం చేశారు. తమ కష్టం సబ్ కలెక్టర్‌కే చెప్పుకుంటానంటూ టవర్ దిగేది లేదని చెప్పేశాడు. భార్య ప్రమీలను కూడా తీసుకొచ్చి ఫోన్‌లో మాట్లాడించారు. అయినా క్రాంతి కిందికి దిగిరాలేదు. మరో డిమాండ్‌ తెరపైకి తీసుకొచ్చాడు. అత్తను అరెస్టు చేస్తే కానీ తాను కిందికి దిగి రానని భీష్మించి కూర్చున్నాడు. అత్త, బామర్ధి కారణంగానే భార్య కాపురానికి రాలేదని, వారిపై కేసు నమోదు చేస్తేనే సెల్ టవర్ దిగ్గుతానని బెదించాడు.

ఘటన స్ధలానికి అత్తారింటి వాళ్లను రప్పించిన పోలీసులు అత్తపై కేసు నమోదు చేసి భార్యను కాపురానికి పంపిస్తామని హమీ ఇవ్వడంతో శాంతించాడు క్రాంతి. సెల్ టవర్ దిగ్గి క్రిందకు వచ్చాడు.

Also Read:  పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్‌..

Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Dec 2021 05:17 PM (IST) Tags: Breaking News Latest News Tirupathi Chittore

సంబంధిత కథనాలు

నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు

నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల, Feb 22 నుండి 28 వరకు - ఇలా బుక్ చేస్కోండి

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల, Feb 22 నుండి 28 వరకు - ఇలా బుక్ చేస్కోండి

Tirumala News: ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరుడికి ఏ నైవేద్యం సమర్పిస్తారంటే?

Tirumala News: ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరుడికి ఏ నైవేద్యం సమర్పిస్తారంటే?

జల్లికట్టులో అపశృతి - సరదా కోసం వెళ్తే ప్రాణం పోయింది ! మరో నలుగురికి గాయాలు

జల్లికట్టులో అపశృతి - సరదా కోసం వెళ్తే ప్రాణం పోయింది ! మరో నలుగురికి గాయాలు

ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో నాయీబ్రాహ్మణులకు ఛాన్స్- సంతోషం వ్యక్తం చేస్తున్న వైసీపీ లీడర్లు

ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో నాయీబ్రాహ్మణులకు ఛాన్స్- సంతోషం వ్యక్తం చేస్తున్న వైసీపీ లీడర్లు

టాప్ స్టోరీస్

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ

Shiva Rajkumar Emotional :  కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ

Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్‌!

Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్‌!

Earthquake Risk Zones: ఇండియాలోనూ భారీ భూకంపాలు తప్పవా? హై రిస్క్ జోన్‌లో ఆ నగరాలు

Earthquake Risk Zones: ఇండియాలోనూ భారీ భూకంపాలు తప్పవా? హై రిస్క్ జోన్‌లో ఆ నగరాలు