Crime News : పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్‌..

ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల బాధితుడి కుటుంబం రఘువీర్ నగర్‌లో నివసిస్తుంది. కాగా, సాగర్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో దాదాపు రెండేళ్లుగా అతను ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.

FOLLOW US: 

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో ఓ యువకుడి ప్రైవేట్ పార్ట్‌లను నరికివేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు హత్య, కిడ్నాప్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు గురించి ఢిల్లీ పశ్చిమ మండల డీసీపీ ప్రశాంత్ గౌతమ్ మాట్లాడుతూ.. గురువారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి పీసీఆర్ కాల్ వచ్చిందని, ఇందులో రాజౌరి గార్డెన్‌కు చెందిన వ్యక్తిని తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పారని తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల బాధితుడి కుటుంబం రఘువీర్ నగర్‌లో నివసిస్తుంది. కాగా, సాగర్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో దాదాపు రెండేళ్లుగా అతను ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అంతే కాదు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయి తరపు కుటుంబ సభ్యులను అందరినీ ఒప్పించే ప్రయత్నం చేసినా ఎవరూ అంగీకరించలేదు. దీంతో చేసేది లేక యువకుడు, యువతి పారిపోయి గత డిసెంబర్ 21న జైపూర్ చేరుకున్నారు. అక్కడ ఓ గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీని తరువాత డిసెంబర్ 22 న, ఇద్దరూ ఢిల్లీకి తిరిగి వచ్చి రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో ఉన్నారు. అనంతరం ఇద్దరు కలిసి ఉంటున్న విషయం బాలిక తరపు కుటుంబ సభ్యులకు తెలిసింది.

మొదట తీవ్రంగా కొట్టి ఆ తర్వాత...
యువకుడు, యువతి రాజౌరి గార్డెన్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు వారు ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ తనతో పాటు సాగర్‌పూర్‌కు తీసుకెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు ముందుగా యువకుడిపై దాడి చేసి, మరో చోటికి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో అతని జననాంగాలను కోసేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాత యువకుడిని సాగర్‌పూర్‌లోని అడవిలో పడేశారు. దీని తరువాత, పోలీసులకు గురువారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి కాల్ వచ్చింది, అందులో రాజౌరి గార్డెన్‌కు చెందిన వ్యక్తి గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆస్పత్రి వర్గాలు పోలీసులతో చెప్పారు.

Also Read: Cheating Relationship : చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !

బాలిక పారిపోయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ప్రియుడ్ని పెళ్లి చేసుకుందనే కోపంతోనే బాలిక కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో యువకుడిని కిడ్నాప్ చేసి, మొదట కొట్టి, ఆపై అతని ప్రైవేట్ పార్ట్ కోసి, సాగర్‌పూర్ ప్రాంతంలో విసిరి పారిపోయాడు. ప్రస్తుతం, యువకుడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అదే సమయంలో నిందితుల తరఫు కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Dec 2021 11:02 AM (IST) Tags: New Delhi Crime Private parts cut Delhi man Private parts cut Rajouri Garden crime Delhi Lovers crime

సంబంధిత కథనాలు

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Jagityal Man Kindnapped: ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ - కాళ్లు, చేతులు కట్టేసిన ఫొటోతో రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్స్

Jagityal Man Kindnapped: ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ - కాళ్లు, చేతులు కట్టేసిన ఫొటోతో రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్స్

Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ

Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ

Tirupati Police Thiefs : దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?

Tirupati Police Thiefs :  దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

టాప్ స్టోరీస్

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?