Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
Balakrishna Jr NTR Aha Controversy: ఆహా షోలో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు రాకూడదని బాలకృష్ణ కండిషన్ పెట్టారనే పుకార్ల పట్ల బాబి స్పందించారు. తెలంగాణలో టికెట్ రేట్లపై హ్యాపీగా ఉన్నామని నాగ వంశీ చెప్పారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' (Unstoppable 4)లో 'డాకు మహారాజ్' టీమ్ పాల్గొంది. దర్శకుడు బాబీ కొల్లి తీసిన సినిమాల హీరోల ఫోటోలు చూపించి వాళ్ల గురించి చెప్పమని బాలకృష్ణ అడిగారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' ప్రస్తావన లేకపోవడం, ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ 'దబిడి దిబిడి' ట్రోల్ అవ్వడం, తెలంగాణాలో టికెట్ రేట్స్ గురించి ఇవాళ జరిగిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాతలు స్పందించారు.
బాలయ్యకు 'జై లవ కుశ' అంటే ఇష్టం
అంత డ్రామా జరగలేదు... కవర్ చేయట్లేదు
బాలకృష్ణకు 'జై లవ కుశ' అంటే ఇష్టమని దర్శకుడు బాబీ తెలిపారు. 'ఆ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించ వద్దని ముందే మీకు సూచనలు అందాయని తెలిసింది. అది నిజమేనా?' అని ప్రశ్నించగా... ఆహా షో తర్వాత తలెత్తిన వివాదం గురించి ఆయన మాట్లాడుతూ... ''అంత డ్రామా జరగలేదు. దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవి ఏమీ లేవు. అక్కడ స్లైడ్స్‌లో ఏవైతే ఫోటోలు వేశారో వాటి గురించి మాత్రమే బాలకృష్ణ అడిగారు. నేను సమాధానం చెప్పాను. అంతే జరిగింది. ఇటీవల వంశీ గారు చెప్పినట్టు... షో మధ్యలో గ్యాప్ వస్తుంది. అప్పుడు ఒక సినిమాలో మా తారక్ అయితే చాలా బావుంటాడని ఆయన చెప్పారు. అది రికార్డ్ కాలేదు కనుక బయటకు రాలేదు. ఆయనకు 'జై లవ కుశ' సినిమా చాలా ఇష్టం. దాని గురించి నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు. ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్దది చేస్తూ ఉంటాం'' అని చెప్పారు.
ఊర్వశీ రౌతేలాకు తెలుగు తెలియక...
'డాకు మహారాజ్'లోని 'దబిడి దిబిడి' సాంగ్ విడుదలైన తర్వాత విపరీతమైన ట్రోల్స్ రాగా... వాటిలో కొన్నిటిని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశీ రౌతేలా షేర్ చేశారు. ఆ అంశం గురించి ప్రస్తావన రాగా... ''ఊర్వశికి తెలుగు తెలియక షేర్ చేసింది. తనను ఆవిడ పొగిడారని అనుకుంది. తర్వాత నేను, బాబీ ఆవిడకు వివరించి డిలీట్ చేయించాం'' అని నిర్మాత నాగవంశీ తెలిపారు.
Also Read: రేసింగ్ సర్క్యూట్‌లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్లతో తాము హ్యాపీగా ఉన్నామని, ప్రభుత్వాన్ని హైక్ అడగటం లేదని నాగ వంశీ తెలిపారు. ఆల్రెడీ ఏపీలో 'డాకు మహారాజ్'కు రేట్లు పెంచుతూ అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ... ''గురువారం (జనవరి 9న) ఏపీలోని అనంతపురంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాం. తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. అమెరికాలోనూ భారీ రిలీజ్ ఉంటుంది. అక్కడ బుకింగ్స్ చాలా బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ జనవరి 12న విడుదల అవుతోంది. నేను సినిమా చూశా, నమ్మకంగా చెబుతున్నా... బాలకృష్ణ గారి ప్రయాణంలో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది'' అని అన్నారు.
Also Read: పాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో