అన్వేషించండి

Ajith Car Accident: రేసింగ్ సర్క్యూట్ లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్

Ajith Kumar Accident: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రేసర్ కూడా. ఆయన రేసింగ్ సర్క్యూట్ లో పాల్గొనడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతరుణంలో ఆయన కార్ ఘోర ప్రమాదానికి గురైంది. ఆ వివరాల్లోకి వెళ్తే...

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) సినిమా సంక్రాంతికి వస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. అయితే... 'విడా మయూర్చి' వాయిదా పడింది. మరో సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అజిత్ వార్తల్లో ఉండేలా చేసింది ఆ రెండు సినిమాలో కాదు... రేసింగ్! ఆయనకు బైక్, కార్ రేసింగ్ అంటే ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్ వేదికగా జరగనున్న 'Dubai 24 Hours Race'లో పాల్గొనడం కోసం ఆయన వెళ్లారు.

అజిత్ కారుకు ఘోర ప్రమాదం!
దుబాయ్ వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో బార్య‌ శాలిని, కుమారుడు అద్విక్... ఇద్దరికీ అజిత్ సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ వెళ్లిన ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. అందులో అజిత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. 

అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో తెలియజేసింది. ''ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కారు మాసివ్ క్రాష్ అయింది. అయితే ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు. ఎటువంటి గాయాలు లేకుండా బయటకు నడుచుకుంటూ వచ్చారు. రేసింగ్ అంటే అంతే'' అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్ పేర్కొంది.

Also Read: పాన్ ఇండియా స్పై థ్రిల్లర్‌తో టాలీవుడ్‌లోకి వామిక రీ ఎంట్రీ - హ్యాండ్సమ్ హీరోతో యాక్షన్ ఫిల్మ్‌లో

అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరో కారు ప్రమాదానికి గురైతే, అందులోనూ కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో కారు రేసింగ్ సర్క్యూట్ లో ప్రమాదానికి గురైతే... ఆయనకు ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతారు. అందుకని ముందుగా అందరికీ సమాచారం ఇచ్చారు. ''రేసింగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియో బయటకు వచ్చింది. అజిత్ గారు సురక్షితంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని అజిత్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 

సొంతంగా టీం ఏర్పాటు చేసిన అజిత్ కుమార్!
'దుబాయ్ 24 అవర్స్ రేసింగ్'లో పార్టిసిపేట్ చేయడం కోసం కోలీవుడ్ స్టార్ అజిత్ సొంతంగా ఒక టీం ఏర్పాటు చేశారు. దానికి ఓనర్ ఆయనే. ఒకవైపు యజమానిగా, మరొక వైపు రేసర్ కింద ఈ రేసులో ఆయన పాల్గొంటారు. ఒక ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్‌లో అజిత్ పార్టిసిపేట్ చేస్తుండటం ఇదే మొదటి సారి. ఒకవేళ ఇందులో గనక ఆయన విజయం సాధిస్తే... గ్రాండ్ డెబ్యూ ఇచ్చినట్లు అవుతుంది. 

Also Readవార్నీ... 'జబర్దస్త్' బ్యూటీ ఒరిజినల్ పేరు రీతూ చౌదరి కాదు - 700 కోట్ల లాండ్ స్కాంతో ఆ సీక్రెట్, అసలు పేరు వెలుగులోకి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అజిత్ ఫ్యామిలీ సింగపూర్ వెళ్ళింది. అక్కడే తన కుమార్తె అనౌష్క పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేశారు.‌ జనవరి 5న ఇండియా వచ్చిన అజిత్...‌‌ ఒక రోజు తర్వాత మళ్లీ రేసింగ్ కోసం దుబాయ్ ప్రయాణం అయ్యారు.  ఆ తర్వాత కుటుంబాన్ని ఇండియాలో వదిలి వెళ్లారు.

టాప్ హెడ్ లైన్స్

Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Eesha Rebba Tharun Bhascker: ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్... రిలేషన్షిప్ రూమర్లకు చెక్ పెడుతూ అఫీషియల్‌గా
ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్... రిలేషన్షిప్ రూమర్లకు చెక్ పెడుతూ అఫీషియల్‌గా
Vijay Ajith : అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
Vishwambhara OTT Deal : మెగాస్టార్ విశ్వంభర ఓటీటీ డీల్ ఫిక్స్! - సంక్రాంతి రేసులో మూవీ?... మరి 'కాకా' ఏం చేస్తారో?
మెగాస్టార్ విశ్వంభర ఓటీటీ డీల్ ఫిక్స్! - సంక్రాంతి రేసులో మూవీ?... మరి 'కాకా' ఏం చేస్తారో?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
IND VS AFG Series Deciding Clash: సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
ఆరోగ్యం, పవిత్రత: ఎండిన తులసితో ధూపం, తీర్థం తయారు చేసే విధానం!
ఆరోగ్యం, పవిత్రత: ఎండిన తులసితో ధూపం, తీర్థం తయారు చేసే విధానం!
Embed widget