ప్రభాస్ 'రాజాసాబ్' కి పోటీగా అజిత్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కొత్త రిలీజ్‌ డేట్‌

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 10న ఫిక్స్ చేశారు మేకర్స్

కొలీవుడ్ లో అజిత్‌కు భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది..తన లెటెస్ట్ మూవీస్ 'విడాముయర్చి','గుడ్ బ్యాడ్ అగ్లీ' కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు

'విడాముయర్చి' సంక్రాంతికి వస్తుందని ప్రకటించడంతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదల ఆలస్యమైంది..

లేటెస్ట్ గా విడాముయర్చి కూడా వాయిదా వేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించడంతో సంక్రాంతి బరినుంచి తప్పుకున్నాడు అజిత్

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదలవుతుందని చెప్పారు మేకర్స్..త్వరలోనే విడాముయర్చి రిలీజ్‌ డేట్‌ కూడా రాబోతుంది

2025 ప్రధమార్థంలోనే అజిత్ నుంచి డబుల్ ధమాఖా ఉండబోతోందని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

అజిత్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది..

ఇదే రోజు ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే డేట్ అనౌన్స్ చేసేశారు మేకర్స్. ఇప్పడు ప్రభాస్ తో అజిత్ పోటీకి దిగుతున్నాడు

అయితే షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉందని ఎప్రిల్ 10న రాజాసాబ్ రావడం కష్టమే అనే టాక్ కూడా ఉంది