నయన్ కు నోటీసులు మేం ఇవ్వలేదు!

Published by: RAMA

నోటీసులు ఇవ్వలేదు

నయనతారకు నోటీసులు పంపినట్లు వస్తోన్న వార్తలపై ‘చంద్రముఖి’ మూవీ నిర్మాతలు క్లారిటీ ఇస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు

ప్రచారం మాత్రమే...

నయనతారకు తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని..తాము 5 కోట్లు డిమాండ్ చేశామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు

చుట్టూ వివాదాలే

నయనతార తన జీవితంపై ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది.

ధనుష్ తో మొదలు

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. ఇది రిలీజైనప్పటి నుంచీ నిత్యం వార్తల్లోనే ఉంది.

మాకేం అభ్యంతరం లేదు

ఈ డాక్యుమెంటరీ కోసం ‘చంద్రముఖి’లోని కొన్ని సీన్స్ ఉపయోగించడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తలొచ్చాయి

ముందే చెప్పారు

నయనతార నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారని స్పష్టం చేశారు ‘చంద్రముఖి’ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్

ఇలాంటి ప్రచారాలు వద్దు

నోటీసులు పంపించలేదని.. రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ కొట్టిపడేసింది

పర్మిషన్ తీసుకోలేదంటూ లీగల్ నోటీసులు

‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’లో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ ఫుటేజ్‌ను ఉపయోగించారంటూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు.