News
News
X

Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయిదు నెలల బాబు కూడా ఉన్నాడు. తాను ఉంటున్న ఊరిలోనే ఉండే ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ నెల రోజులుగా వెంటపడుతున్నాడు.

FOLLOW US: 

పెళ్లి జరిగి భర్త, ఐదు నెలల కుమారుడితో హాయిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళపై కోరికతో ఓ వ్యక్తి దాష్టీకానికి పాల్పడ్డాడు. తన కోరికను ఆమె తీర్చడం లేదనే అక్కసుతో ఏకంగా విచక్షణారహితంగా దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమె తల్లిపై దాడితో పాటు విపరీతమైన బెదిరింపులకు గురి చేశాడు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు మాత్రం అతని గురించి పట్టించుకోక పోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు, బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయిదు నెలల బాబు కూడా ఉన్నాడు. తాను ఉంటున్న ఊరిలోనే ఉండే ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ నెల రోజులుగా వెంటపడుతున్నాడు. తనకు బాగా పలుకుబడి ఉందని, అధికార బలం ఉందని, ఎవరూ ఏమీ చేయలేరని భయానికి గురి చేశాడు. భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కామాంధుడు తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆ మహిళతో పాటు ఆమె తల్లిపై ఇష్టం వచ్చిన విధంగా దాడి చేశాడు. అయినా, పోలీసుల నుంచి ఇంత వరకు చర్యలు లేవు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను ఇదే ప్రాంతంలోని తాళ్లూరుకు చెందిన సీహెచ్‌ ఏడుకొండలు అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమె భర్తకు ఫోన్‌ చేసి ఆమెను తన వద్దకు పంపాలంటూ బెదిరించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక గత నెల 28వ తేదీన ఆమె కనిగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. అయినా, పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈనెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో ఇంకోసారి వినతి అందించారు. అక్కడినుంచి కనిగిరి చేరుకొని తల్లితో కలిసి ఆమె నడిచివస్తుండగా స్థానిక పామూరు బస్టాండ్‌ సమీపంలో ఏడు కొండలు అడ్డుకున్నాడు. 

తనపైనే పైనే కేసు పెడతావా అంటూ వారు ఇద్దరినీ రక్తమొచ్చేలా కొట్టాడు. ‘మీ ఫ్యామిలీని ఊళ్లో లేకుండా చేస్తా.. నీ భర్తను తరిమేస్తా’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఆమె మరోసారి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దాడి కేసు నమోదు చేశారు. అయినా ఏడుకొండలుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులంతా కనిగిరిలోని రజక సంఘం నాయకులను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించారు. వేధింపులకు పాల్పడుతున్న ఏడుకొండలును వెంటనే అరెస్టు చేయకపోతే రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేస్తామని నాయకులు తెలిపారు.

Also Read: చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !

Also Read: భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి.. రక్తదానమే గిఫ్ట్.. అవయవ దానమే ఆశీర్వాదం

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Dec 2021 10:30 AM (IST) Tags: Prakasam District Kanigiri Man assault man harrases woman kanigiri crime prakasam crime

సంబంధిత కథనాలు

ప్రాణాలు తీసిన ఎస్సై ప్రిలిమ్స్- యువతి, యువకుడు మృతి

ప్రాణాలు తీసిన ఎస్సై ప్రిలిమ్స్- యువతి, యువకుడు మృతి

పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు

పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు

Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !

Gorantla Madhav Issue :  వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం -  ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ  !

నల్గొండలో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మది రోహిత్ అరెస్ట్

నల్గొండలో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మది రోహిత్ అరెస్ట్

మేం ప్రేమికులం కాదు ? మా చావుతోనైనా అర్థం చేస్కోండి!

మేం ప్రేమికులం కాదు ? మా చావుతోనైనా అర్థం చేస్కోండి!

టాప్ స్టోరీస్

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక

దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!