News
News
X

ESI Scam ED : తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఈడీ దూకుడు.. రూ. 144 కోట్ల ఆస్తుల జప్తు !

తెలంగాణ ఈఎస్‌ఐ స్కాం విషయంలో ఈడీ దూకుడు పెంచింది. రూ. 144 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది.

FOLLOW US: 
 
తెలంగాణ ఈఎస్‌ఐ స్కాంలో  ఎన్‌ఫోర్స్‌మెట్ డైరక్టరేట్ రూ. 144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో 133 వివిధ రకాల ఆస్తులు ఉన్నాయి. ఫ్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీ తో పాటు ఈఎస్‌ఐ డైరక్టర్‌గా వ్యవహరించి మొత్తం స్కాంకు సూత్రధారిగా ఉన్న దేవికారాణికి చెందిన రూ. ఆరు కోట్ల 26లక్షల విలువైన నగలు కూడా జప్తు చేసిన దాంట్లో ఉన్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. పెద్ద ఎత్తున మనీలాంరింగ్ జరిగినట్లుగా గుర్తించి.. ఆస్తులను సీజ్ చేసింది.  మాజీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఆమ్నీ మెడికల్‌ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్‌ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డి ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్స్‌.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..

 ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌  విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్‌ఎస్‌ ఉద్యోగులు, మెడికల్‌ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు కాజేసినట్లుగా  ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్‌ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఏసీబీకి లేఖ మేరకు  ఏసీబీ విచారణ నిర్వహించింది.   మాజీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఆమ్నీ మెడికల్‌ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్‌ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. దీనిపై ఏసీబీ ఏడు కేసులు నమోదు చేసింది.  దేవికారాణిసహా పలువుర్ని అరెస్ట్ చేసింది. తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. 

Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..

News Reels

ఏసీబీ  కేసుల ఆధారంగా ఈడీ కూడా విచారణ ప్రారంభించి పలువు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించడం కలకలం  నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే  ఈ కేసు విషయంలో ఆయన పాత్రపై ఇంకా స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. 

Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 

ఈఎస్ఐ స్కాంలో ఇప్పటికే ఏసీబీ కేసులు నడుస్తున్నాయి. అదనంగా ఈడీ ఆస్తులు కూడా అటాచ్ చేసింది. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరగడంతో..  నిందితులు నిండా మునిగిపోయినట్లుగా భావిస్తున్నారు. 

Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Nov 2021 06:12 PM (IST) Tags: telangana ESI scam Devikarani ED attach attach the assets of the accused

సంబంధిత కథనాలు

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Loan App Threats : అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా! స్నేహితులకు లాస్ట్ కాల్, ఆ తర్వాత!

Loan App Threats : అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా! స్నేహితులకు లాస్ట్ కాల్, ఆ తర్వాత!

Nirmal Bus Electrocution : విహారయాత్ర బస్సును తాకిన విద్యుత్ తీగలు, బస్సులో 56 మంది విద్యార్థులు!

Nirmal Bus Electrocution :  విహారయాత్ర బస్సును తాకిన విద్యుత్ తీగలు, బస్సులో 56 మంది విద్యార్థులు!

టాప్ స్టోరీస్

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?