YS Viveka Murder Case : వివేకా కేసులో ప్రలోభపెడుతోంది ఎవరు ? డ్రామాలాడుతోంది ఎవరు ?
వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి - అనుమానితుడు భరత్ యాదవ్ పరస్పర ఆరోపణలు చేసుకుటున్నారు. భరత్ యాదవ్ ప్రలోభ పెట్టారని దస్తగిరి ఆరోపిస్తే... తనకు రావాల్సిన డబ్బులను మాత్రమే అడిగానని భరత్ యాదవ్ చెబుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి ( YS Vivekanamda Reddy ) హత్య కేసులో రోజు రోజుకు కీలక పరిమామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్ ( Bharat Yadav ) భయపెడుతున్నారని, ప్రలోభ పెడుతున్నారని ఫిర్యాదును సీబీఐకి ( CBI ) ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని .. అప్రూవర్‌గా మారిన తర్వాత భరత్ యాదవ్ తన ఇంటికి వస్తన్నారని అవినాష్ రెడ్డిని ( Avinash Reddy ) కలవాలంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తన భార్య బిడ్డలు అనాధలు కాకూడదనే అప్రూవర్ గా మారి సీబీఐ ముందు నిజాలను చెప్పానన్నాడు దస్తగిరి ( Dastagiri ) . అప్రూవర్ స్టేట్ మెంట్ ఇవ్వక ముందు కొన్ని బెదిరింపులు వచ్చాయని దస్తగిరి చెబుతున్నారు.
వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్ కేసు ! తర్వాత ఏంటి ?
దస్తగిరి చేసిన ఆరోపణలపై భరత్ యాదవ్ స్పందించారు. దస్తగిరి ని సీబీఐ వాళ్ళు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ఏమైనా చేసే వ్యక్తి దస్తగిరి అని అనవసరంగా అందరి పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శఇంచారు. దస్తగిరి ని ప్రలోభాలకు గురి చేశామని నిన్న ఇచ్చిన వాంగ్మూలం ( Statement ) పూర్తిగా అవాస్తవమన్నారు. మామిడి తోట వద్దకు దస్తగిరిని ఎవరూ రమ్మనలేదని స్పష్టం చేశారు. లాయర్ ఓబుల్ రెడ్డిని ( Obul Reddy ) కలవాలంటూ చెప్పలేదన్నారు. డబ్బుల కోసమే తమపై దస్తగిరి ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు డు. డబ్బులు కావాలంటూ పదేపదే అడిగేవాడని పేర్కొన్నాడు. రావాల్సిన డబ్బులు దస్తగిరి ని అడిగానని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కావాలనే దస్తగిరి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సీబీఐ వాళ్ళు మీడియా తో మాట్లాడితే కేసులు పెడతామని భయపెట్టారని అందుకే ఇంత వరకూ వరకు మీడియా ముందుకు రాలేదన్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం వల్ల నేడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
వివేకా హత్య కేసులో మరో సారి దస్తగిరి వాంగ్మూలం - ఈ సారి అప్రూవర్‌గా !
అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్ సంచలనం సృష్టించడంతో ఇప్పుడు ఆయన బహిరంగంగా చేసిన ఆరోపణలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ భరత్ యాదవ్‌తో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు సీబీఐ అధికారి రాంసింగ్‌పైనా క( CBI Officer Ram Singh ) డప పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది . ముందు ముందు ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.