Anantapur Suiside : అతడిది "ఆవిడా మా ఆవిడే " స్టోరీనే కానీ తెలియకుండా మేనేజ్ చేసేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ..! ఎందుకంటే ?
అనంతపురంలో నాగేంద్ర అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దర్ని పెళ్లి చేసుకుని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
![Anantapur Suiside : అతడిది Anantapur youth commits suicide after failing to raise two wives Anantapur Suiside : అతడిది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/8d06b854f42a286564ee95dc55c500b3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అనంతపురంలో నవోదయ కాలనీకి చెందిన సాకే నాగేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ బాధలు లేవు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇంత హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య ... ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఏడుస్తున్నారు. బంధువులు అంతా వచ్చారు. అయితే కాసేపటికి మరో మహిళ కూడా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విలపిస్తూ వచ్చింది. అక్కడున్న ఎవరికీ సీన్ అర్థం కాలేదు. కానీ కాసేపటికి ఆమె చెప్పింది విన్న తర్వాత మొత్తం అక్కడున్న వారికి అర్థం అయింది. చివరికి సాకే నాగేంద్ర ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కూడా తెలిసిపోయింది.
Also Read: సూర్యాపేట కాలేజీలో ర్యాగింగ్, యువకుడ్ని రూంకి పిలిచి బట్టలిప్పించి.. బలవంతంగా ట్రిమ్మర్‌తో...!
సాకే నాగేంద్ర ఓ డ్రిప్ కంపెనీలో జిల్లా అధికారిగా పని చేస్తున్నాడు. అతనికి భార్య జ్ఞానేశ్వరి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. జీవితం సాఫీగా గడుస్తున్న సమయంలో అతని కంపెనీ చిత్తూరుకు బదిలీ చేసింది. దీంతో పిల్లల చదువులు.., ఇతర అవసరాల కోసం ఫ్యామిలీని అనంతపురంలో ఉంచి తాను చిత్తూరు వెళ్లాడు. అయితే అక్కడ దుర్గా భవాని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ అనుమానం రాకుండా రెండు ప్యామిలీల్ని మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చాడు. తర్వాత మళ్లీ అనంతపురంకు బదిలీ చేయించుకుని వచ్చేశాడు. వచ్చేటప్పుడు రెండో ఫ్యామిలీని తెచ్చుకున్నాడు.
Also Read: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
అనంతపురం హౌసింగ్ బోర్డులోని ఎంఐజీ బస్టాఫ్ వద్ద ఉన్న ఓ ఇంటిలో రెండో ఫ్యామిలీని ఉంచాడు. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. రెండు ఫ్యామిలీలకు సమయం కేటాయిస్తూ బాగానే మెయిన్‌టెయిన్ చేశాడు. కానీ అసలు విషయం మాత్రం మర్చిపోయాడు. అదేమిటంటే సంపాదన. అతని సంపాదన రెండు ఫ్యామిలీలకు సరిపోవడం లేదు. రోజుకు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియక దిగులుపడ్డాడు. ఇక రెండు కుటుంబాలను పోషించడం కష్టమని ప్రాణాలు తీసుకున్నాడు.
Also Read: Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ
అనాలోచితంగా చేసిన చర్యల వల్ల రెండు కుటుంబాలకు పెద్ద అయిన వ్యక్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కుటుంబాలు అనాధగా మారిపోయాయి. తమ పరిస్థితేమిటని ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సాధారణంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారికి కుటుంబ సమస్యలు తలెత్తి ఆత్మహత్య వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ నాగేంద్ర మాత్రం ఎలాగోలా మెయిన్‌టెయిన్ చేసినా పోషించలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రోజుల్లో రెండు ఫ్యామిలీలు మెయిన్‌టెయిన్ చేయడం అంటే సాధ్యం కాదని నాగేంద్రకు ఆలస్యంగా అర్థం అయింది. కానీ ప్రయోజనం లేకపోయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)