Kukatpally Fire Accident: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
Kukatpally Fire Accident At Shiva Parvathi Theatre: కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్‌లో ఫర్నిచర్ మొత్తం అగ్నికి బుగ్గిపాలైంది.
Shiva Parvathi Theatre Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ థియేటర్ లో ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా రన్ చేస్తున్నారు. అయితే రాత్రి సెకండ్ షో పూర్తయిన తరువాత థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి ఫర్నిచర్ మొత్తం అగ్నికి బుగ్గిపాలైంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మూడు ఫైరింజన్లు, సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 3 గంటల ప్రాంతంలో శివపార్వతి థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సెకండ్ షో పూర్తయిన తరువాత థియేటర్ సిబ్బంది హాల్ మొత్తం క్లీన్ చేసి వెళ్లిపోయారు. కొందరు థియేటర్ పరిసర ప్రాంతాల్లో నిద్రించారు. ఈ సమయంలో ఒక్కసారిగా నిప్పు రాజేసుకుని భారీ అగ్నికీలలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో శివ పార్వతి థియేటర్ అగ్నికి దగ్ధమైపోయింది. సిబ్బంది ఇది గమనించి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
షార్ట్ సర్క్యూటే కారణమా..?
శివపార్వతి థియేటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మంటలు త్వరగా వ్యాపించే వస్తువులు ఉండటం కారణంగా నిమిషాల వ్యవధిలో థియేటర్ మంటల్లో కాలి బూడిదైపోయింది. స్క్రీన్, కుర్చీలు, గోడలు, పైకప్పు.. ఇలా మొత్తం మంటలకు దగ్ధమయ్యాయి.
పోలీసులు ఏమన్నారంటే..
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని శివపార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఘటనా స్థలాన్ని రాత్రి పరిశీలించారు. సెకండ్ షో అయ్యా, థియేటర్ క్లీన్ చేసిన తరువాత ఒంటి గంటల సమయంలో వాచ్‌మెన్, రాత్రి సిబ్బంది అక్కడే నిద్రించారు. మంటలు వ్యాపించిన తరువాత తాము ఇది గమనించామని సిబ్బంది తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే షార్ట్ సర్క్యూటే కారణమా, లేక ఏవైనా కుట్ర కోణం ఉందా అని అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఏ సమయంలో, ఎక్కడ మంటలు మొదలయ్యాయి.. ఏ సమయానికి సమాచారం అందించారు అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. సమీపంలోనే ఫైరింజన్లు ఉన్నప్పటికీ ఎందుకింత భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. చాలా ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతోనే ఫైరింజన్లు థియేటర్ కాలిపోయిన తరువాత అక్కడికి చేరుకున్నాయని సమాచారం.
Also Read: Karimnagar: కరీంనగర్ లో హైడ్రామా... బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం... అరెస్టు చేసిన పోలీసులు
Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు