Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య 14 స్పెషల్ ట్రైన్లు, ఇతర ప్రాంతాలకు మరో 10 రైళ్లు నడపనుంది.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 7, 22వ తేదీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16న విశాఖపట్నం-కాచిగూడ, 11వ తేదీన కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ -విశాఖ స్పెషల్ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ- నర్సాపూర్ ట్రైన్ మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది. కాకినాడ టౌన్- లింగంపల్లి రైలు సామర్లకోట, రాజమంత్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
Also Read: శ్రీకాళహస్తీశ్వరుని సేవలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్....
10 Sankranti Special Trains between various destinations#Sankranthi2022 #specialtrains pic.twitter.com/Ohzify0irc
— South Central Railway (@SCRailwayIndia) January 1, 2022
కాకినాడ-లింగంపల్లి మధ్య 14 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు వివరాలను దక్షిణ మధ్యరైల్వే ట్విట్టర్లో వెల్లడించింది. కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైలు నెంబరు 07275 జనవరి 3, 5, 7 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.15 గం.లకు లింగంపల్లికి చేరుకోనుంది. రైలు నెం.07276.. జనవరి 4, 6, 8 తేదీల్లో సాయంత్రం 06.40 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.10 గం.లకు కాకినాడ టౌన్‌కి చేరుకోనుంది. మరో ప్రత్యేక రైలు నెం.07491 జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు లింగంపల్లికి రైలు చేరుకుంటుంది. ప్రత్యేక రైలు నెం.07492 ఈ నెల 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 6.50 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకోనుంది. మరో ప్రత్యేక రైలు నెం.82714 జనవరి 11న సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలేదేరి మరుసటి రోజు ఉదయం 06.50 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
14 Sankranti Special Trains between Kakinada Town - Lingampalli #Sankranti #SpecialTrains #sankranthi #festivals @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/Aw8ZMDsrJi
— South Central Railway (@SCRailwayIndia) December 30, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.