By: ABP Desam | Updated at : 01 Jan 2022 04:29 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బాలీవుడ్ నటి కంగనా రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె... తాజా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కంగనా రనౌత్ కు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కంగనా రనౌత్ ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కంగనా రనౌత్ కు గురు దక్షిణామూర్తి మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.
శ్రీవారి సేవలో
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని హీరోయిన్ కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఈ వేకువజామున రెండు గంటలకు వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో కంగనా రనౌత్ కు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Also Read: న్యూ ఇయర్ సందడి... హీరోగా మారుతున్న యంగ్ కమెడియన్... హన్సిక '105 మినిట్స్' అప్‌డేట్
రెండేళ్లుగా టెన్షన్ లో ఉన్నాం : నటుడు సాయి కుమార్
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఈ వేకువజామున రెండు గంటలకు వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల నటుడు సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా కరోనా కారణంగా సినీపరిశ్రమ టెన్షన్ లో ఉందని సాయి కుమార్ అన్నారు. ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈ సంవత్సరం తనకు ముఖ్యమైన సంవత్సరమని, మేకప్ వేసుకుని 50 యేళ్ళు పూర్తవుతోందన్నారు. ప్రస్తుతం ప్రభుదేవా, ధనుష్, నానిలతో సినిమాలు చేస్తున్నానని చెప్పారు. నిర్మాతల్లో చిన్న సందిగ్ధం ఉందని, ప్రస్తుత పరిస్థితులలో ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందన్నారు.
Also Read: దీప్తితో బ్రేకప్‌పై స్పందించిన షన్ముఖ్.. ‘చివరిగా నేను కోరుకొనేది ఇదే దీపు’
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్
Vidadala Rajini : కొలకలూరులో ప్రబలిన డయేరియా, బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని
Jagan Daughter Harsha : కుమార్తె విజయంపై సంతోషం - ప్యారిస్ నుంచి సీఎం జగన్ ట్వీట్ వైరల్
Tirupati Accident : తిరుపతిలో ఘోర ప్రమాదం, ఫ్లై ఓవర్ పై నుంచి పడి ఇద్దరు విద్యార్థులు మృతి
Modi Tour In AP: ఏపీలో మోదీ టూర్లో కఠిన ఆంక్షలు- వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు
IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్