Tollywood Updates: న్యూ ఇయర్ సందడి... హీరోగా మారుతున్న యంగ్ కమెడియన్... హన్సిక '105 మినిట్స్' అప్‌డేట్
ABP Desam పాఠకులకు, సినిమా ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఏడాదికి తెలుగు సినిమా పరిశ్రమ సందడిగా స్వాగతం పలికింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు విడుదల చేసిన పోస్టర్లు, కొత్త కబుర్లు, ఇంకా ఎన్నో...
LIVE

Background
హీరోగా యంగ్ కమెడియన్ అభినవ్ గోమఠం

'మళ్ళీ రావా', 'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెప్తా', 'రంగ్ దే', 'ఇచ్చట వాహనములు నిలపరాదు' తదితర సినిమాలతో హాస్యనటుడిగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న యువకుడు అభినవ్ గోమఠం. నాని 'శ్యామ్ సింగ రాయ్'లో కాఫీ షాప్ ఓనరుగా, హీరో స్నేహితుడిగా మంచి పాత్ర పోషించారు. త్వరలో ఆయన హీరోగా మారుతున్నారు.
కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో అభినవ్ గోమఠం హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. జనవరి 1న హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.
పోస్ట్ ప్రొడక్షన్‌లో '105 మినిట్స్'
హన్సిక ప్రధాన పాత్రధారిగా బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న సినిమా '105 మినిట్స్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ అద్భుతంగా వస్తున్నాయని, ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని యూనిట్ సభ్యులు చెప్పారు. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని, నేపథ్య సంగీతం అందించడం సవాల్ గా ఉందని సంగీత దర్శకులు సామ్ సి.యస్ అభిప్రాయపడ్డారు.
సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' ముందుకు వస్తుందా? సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారా? సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం సాధ్యమేనా? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి... సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
ప్రేమ, విధి మధ్య యుద్ధం... ప్రభాస్, పూజా హెగ్డే కౌగిలింత
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. 'ప్రేమకు, విధికి మధ్య యుద్ధం' అని అందులో పేర్కొన్నారు.
ఆడవాళ్ళు మీకు జోహార్లు పోస్టర్ అదిరింది!
శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన సినిమా పోస్టర్లో ఫుల్ జోష్ కనిపించింది. అందరూ హుషారుగా స్టెప్పులు వేస్తూ ఉన్నారు.
May this New Year give us only reasons to celebrate 🥳
— Sharwanand (@ImSharwanand) January 1, 2022
Team #AadavalluMeekuJohaarlu wishes everyone a very Happy New Year ❤️@iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/0RKXPKTQlE
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

