News
News
X

Chandrababu Meets Radha : వంగవీటి రాధాను పరామర్శించిన చంద్రబాబు .. రెక్కీ చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం !

వంగవీటి రాదాకృష్ణను చంద్రబాబు పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబునాయుడు పరామర్శించారు. తనపై దాడికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కువగా తాడేపల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. తనను పరామర్శించడానికి వచ్చే వారితో అక్కడే సమావేశం అవుతున్నారు. చంద్రబాబు కూడా తాడేపల్లిలోని ఇంటికే వెళ్లారు. వంగవీటి ాధాకృష్ణను రెక్కీ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ తల్లి కూడా ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. 

Also Read: పని చేయని వాళ్లను పక్కన పెడతా.. చంద్రబాబు కొత్త ఏడాది రిజల్యూషన్ !

రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు  పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అసలేమీ చెప్పడం లేదన్నారు. రాధా రెక్కీ విషయం చెప్పిన తర్వాత అసలేం జరిగిందన్నదానిపై ఆందరిలోనూ ఆందోళన ఏర్పడిందన్నారు. ఆ దిశగా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవన్నారు. ఇలాంటి పనులు చేసే వారిని పట్టుకుని శిక్షిస్తే మరొకరు అలాంటి ప్రయత్నాలు చేయరని చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగినా తర్వాత మాత్రం ఖండించారు. దీంతో  రెక్కీ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని వంగవటి రాధా వర్గీయులు భావిస్తున్నారు. 

Also Read: జగన్ పాలనకు 30 నెలలు.. ప్రజాసేవకు పునరంకితం అవుతున్నాం.. : సజ్జల

వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ తనపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని బయట పెట్టారు. ఈ అంశం సంచలనం సృష్టించింది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంక్షంలోనే వంగవీటి రాధాకృష్ణ ఆ ఆరోపణలు చేశారు. తర్వాత కొడాలి నాని సీఎం జగన్‌తో మాట్లాడి నలుగురు గన్‌మెన్ల రక్షణ ఏర్పాటు చేయించారు. అయితే ఆ గన్‌మెన్లు తనకు అవసరం లేదని రాధాకృష్ణ తిప్పి పంపేశారు. తనను రంగా అభిమానులే కాపాడుకుంటారని అన్నారు. 

Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !

రెక్కీ అంశం గురించి తెలిసిన తర్వాత పలువురు టీడీపీ ేతలు వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. చంద్రబాబు కూడా ఈ అంశంపై డీజీపీకి లేఖ రాశారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అదే సమయంమలో వంగవీటి రాధాకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరి కాదని.. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది. 

Also Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ 

Published at : 01 Jan 2022 06:14 PM (IST) Tags: ANDHRA PRADESH vijayawada Vangavati Radhakrishna Rekki on Vangaviti Bejwada police failure

సంబంధిత కథనాలు

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

AP Crime News: అమ్మను ఎలా చంపాడో తాతాకు చెప్పిన మూడేళ్ల చిన్నారి, కేసులో కీలక మలుపు!

AP Crime News: అమ్మను ఎలా చంపాడో తాతాకు చెప్పిన మూడేళ్ల చిన్నారి, కేసులో కీలక మలుపు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

IND vs AUS 3rd T20: చితక్కొట్టిన గ్రీన్, డేవిడ్‌! టీమ్‌ఇండియా ముగింట భారీ టార్గెట్‌

IND vs AUS 3rd T20: చితక్కొట్టిన గ్రీన్, డేవిడ్‌! టీమ్‌ఇండియా ముగింట భారీ టార్గెట్‌

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!