Chandrababu : పని చేయని వాళ్లను పక్కన పెడతా.. చంద్రబాబు కొత్త ఏడాది రిజల్యూషన్ !
ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోందని.. తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇంచార్జ్‌లుగా ఉండి పని చేయని వారిని పక్కన పెడతామన్నారు.
తెలుగుదేశం పార్టీలో పదవులు పొంది పని చేయని వారిని పక్కన పెడతానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో పార్టీలో వివిధ రకాల సంస్థాగత పదవులను భర్తీచేస్తున్నారు. వారి పని తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని సరిగ్గా పని చేయని వారిని తొలగించి కొత్త వారికి చాన్సిస్తామన్నారు. ఎవరి కోసమో పార్టీ త్యాగాలు చేయదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: జగన్ పాలనకు 30 నెలలు.. ప్రజాసేవకు పునరంకితం అవుతున్నాం.. : సజ్జల
ఒకవేళ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు గురించి చర్చ జరుగుతోంది.. ఒక వేళ వస్తే, వాటికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వ అరాచకాలను ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని, వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని, దానిపై తాను స్పందించనన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు.
Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నామని.. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు.ఏ సీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారు.గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారన్నారు.
ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.దిగుబడులు తగ్గాయి.. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది.ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రంలో దిగుబడుల్లో వెనకపడింది.మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది.టీడీపీ హయాంలో బిందు సేద్యం 90 శాతం సబ్సిడీ మీద ఇచ్చాం.. ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదు.ట్రాక్టర్లు.. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో టీడీపీ ఎంతో చేసింది. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యం. ప్రభుత్వం అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారు.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.