Perni Nani : కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !
ప్రభుత్వ కమిటీ నివేదిక త్వాత టిక్కెట్ ధరలను ఖరారు చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఆయన అమరావతిలో సమావేశం అయ్యారు.
సినిమా టిక్కెట్ల ధరల పెంపు ప్రతిపాదనలు సినిమా ధియేటర్ల యజమానలు, డిస్ట్రిబ్యూటర్లు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ఇచ్చారు. పేర్నినానితో టాలీవుడ్ సినిమాకు చెందిన పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ కీలక సమావేశంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 19 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కార్పొరేషన్లలో ఏసీ ధియేటర్లలో టిక్కెట్ ధర కనీసం రూ. 50 ఉండాలని.. బాల్కనీ రూ. 150 ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!
సినిమా థియేటర్ల తనిఖీ విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తెచ్చారు. ళ్లలో వసతులు మెరుగుపర్చాలని ముందే చెప్పామని.. సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామని పేర్ని నాని వారికి చెప్పారు. టిక్కెట్ల ఖరారు అంశంపై కమిటీని నియమించామని ధియేటర్ల వర్గీకరణ, ధరలు ఆ కమిటీ నిర్ణయిస్తుందని పేర్ని నాని సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. సమస్య పరిష్కారం కోసమే కమిటీ వేశామని... వారు ఇచ్చే నివేదికను క్షణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also Read: ప్రజల వద్దకే నేరుగా పథకాలు.. సీఎం జగన్ వెల్లడి, తాజాగా వారి అకౌంట్లలోకి 703 కోట్లు
హీరో నాని, సిద్దార్థ్ లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో..తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లేదన్నారు. జీవో 35 ని ఏప్రిల్ లో ఇచ్చామమని.. ఈ రోజు ఆ జీవో కి నిరసనగా మూసివేయడం ఏమిటని ప్రశ్నంచారు. నాని ఏ ఊరు లో ఉన్నారో..ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదని సెటైర్ వేశారు. సిద్దార్థ్ ఎక్కడుంటారు.. ఆయన చెన్నై లో స్టాలిన్ కోసం మాట్లాడారేమోనని.. సిద్దార్థ్ ఏమైనా ఇక్కడ టాక్స్ లు కట్టాడా...మా ఇళ్ళకి వచ్చి చూశాడా..మేము ఎంత విలాసంగా ఉంటున్నామో అని పేర్ని నాని ప్రశ్నించారు. ధియేటర్లను సీజ్ చేస్తున్న అంశంపైనా స్పందంచారు. చాలా ధియేటర్లు అనుమతి లేకుండా నడుపుతున్నారని రెవిన్యూ శాఖ నుంచి బీఫాం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలన్నారు. గతంలో జరిగిన సమావేశంలో వీటి గురించి చెప్పినప్పటికీ అనేక మంది రెన్యూవల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపించలేదని అందుకే వారిపై చర్యలు తీసుకున్నామన్నారు.
Also Read: భారతీయ జగన్ పార్టీగా బీజేపీ, ఆ సభ కూడా అలాంటిదే.. పయ్యావుల సంచలన వ్యాఖ్యలు
కమిటీ గురించి పేర్ని నాని పదే పదే చెప్పడంతో ఇక కమిటీ తీసుకోబోయే నిర్ణయమే ఫైనల్ అని భావిస్తున్నారు. అపాయింట్‌మెంట్ ఇస్తే సినీపెద్దలంతా సీఎం జగన్‌ను కలుస్తామని దిల్ రాజు చెప్పారు కానీ.. అలాంటి సమావేశం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. హైకోర్టుసూచనతో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా టిక్కెట్ ధరలను ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఎప్పటిలోపు అన్నదానిపై క్లారిటీ లేదు.
Also Read: Movie Ticket Rates Issue: టికెట్ రేట్స్ ఇష్యూ... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులు వీరే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి