Suryapet: సూర్యాపేట కాలేజీలో ర్యాగింగ్, యువకుడ్ని రూంకి పిలిచి బట్టలిప్పించి.. బలవంతంగా ట్రిమ్మర్‌తో...!
హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌కు చేరుకున్నాడు. అతణ్ని చూసిన రెండో సంవత్సరం సీనియర్ విద్యార్థులు దాదాపు 25 మంది తమ గదిలోకి పిలిచి ర్యాగింగ్ చేశారు.
సూర్యాపేటలో ర్యాగింగ్ రక్కసి వెలుగు చూసింది. పట్టణంలోని మెడికల్ కాలేజీలో హాస్టల్‌లో ఉంటూ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సీనియర్ల నుంచి ర్యాగింగ్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌కు చేరుకున్నాడు. అతణ్ని చూసిన రెండో సంవత్సరం సీనియర్ విద్యార్థులు దాదాపు 25 మంది తమ గదిలోకి రమ్మని పిలిచారు.
వారు అప్పటికే మద్యం సేవించి ఉన్నట్లుగా బాధితుడు ఫిర్యాదులో పేర్కొ్న్నాడు. ‘‘వారు నా దుస్తులు విప్పించి సెల్ ఫోన్ లో వీడియో తీశారు. కొంత మంది మద్యం తాగి నాపై దాడికి కూడా పాల్పడ్డారు. అనంతరం ట్రిమ్మర్ తీసుకొని నాకు గుండు గీసేందుకు ప్రయత్నించారు. సీనియర్లు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్ చేయించుకోవడమే కాకుండా నాపై పిడి గుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్ వస్తుందని చెప్పి నేను తప్పించుకుని నా గదికి వెళ్లిపోయాను. నా తండ్రికి ఫోన్ చేసి చెప్పాను. ఆయన వెంటనే డయల్ 100 కు ఫిర్యాదు చేశారు.’’ అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన పై ఆరా తీశారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ర్యాంగింగ్ జరిగితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని కాలేజీ సూపరింటెండెంట్ కూడా తేల్చి చెప్పారు.
హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లికి చెందిన విద్యార్థి సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. పరీక్షలు ఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్‌లోని రెండో ఫ్లోర్‌లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 8.40కు సాయి కుమార్‌ను ఫస్ట్ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. కబురు పంపారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. ఆ తర్వాత దుస్తులు విప్పించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.
Also Read: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
Also Read: Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ