అన్వేషించండి

Bandla Ganesh Vs Vijaysai Reddy : బండ్ల గణేష్ వర్సెస్ విజయసాయి రెడ్డి, మరోసారి ట్వీట్ వార్

Bandla Ganesh Vs Vijaysai Reddy : రాహుల్ గాంధీ పర్యటన బండ్ల గణేష్, విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మరోసారి విజయసాయి రెడ్డి ట్వీట్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.

Bandla Ganesh Vs Vijaysai Reddy : ఏఐసీసీ అBandla Ganesh Vs Vijaysai Reddy : రాహుల్ గాంధీ పర్యటన బండ్ల గణేష్, విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మరోసారి విజయసాయి రెడ్డి ట్వీట్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. 
గ్రనేనత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన(Telangana Tour) ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. రాహుల్ తో భేటీ అయిన వ్యక్తులను విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijaysai Reddy) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సినీ నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. అలాగే నెటిజన్లు కూడా ఇరు వర్గాలుగా విడిపోయిన విమర్శలు చేసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీనటుడు బండ్ల గణేష్ మధ్య ఇటీవల ఒకసారి ట్వీట్ల వార్ జరిగింది. ఓ కులాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని బండ్ల గణేష్ చేసిన ట్వీట్(Tweet) పై విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది వ్యక్తిగతంగా మారింది. తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది. 

బండ్ల గణేష్ కౌంటర్

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఎల్లో మీడియా(Yellow Media) ప్రముఖులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు బండ్ల గణేష్ స్పందించారు. రాహుల్ గాంధీని కలిసినవారందరూ ఎల్లో మీడియా వాళ్లేనా అంటూ బండ్ల గణేష్ చురకలంటించారు. ఆచార్య హరగోపాల్(Haragopal), గద్దర్(Gaddar), ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ ఆలీఖాన్‌లు కూడా రాహుల్‌ను కలిశారన్నారు. వాళ్లు కూడా ఎల్లో మీడియానేనా? అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. విజయసాయి ట్వీట్‌పై ఓ వర్గం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వైసీపీ బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకుందా అని విమర్శలు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్ పై విజయసాయి రెడ్డి ఇంకా స్పందించలేదు. ఆయన ఏం కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. 

గతంలో ట్వీట్ల వార్ 

ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  సినీ నిర్మాత  బండ్ల గణేష్ మధ్య ఇటీవల ట్వీట్ల వార్ నడిచింది. ఒకరి గురించి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ట్వీట్ వార్‌ను బండ్ల గణేష్ ప్రారంభించారు. విజయసాయి రెడ్డి ఓ కులాన్ని నిందిస్తున్నారని ఆరోపిస్తూ బండ్ల గణేష్ విమర్శలు చేశారు. తర్వాత విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. " వైజాగ్ ని కుదిపేసిన తుపాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది.  దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావ్ సాయి" అంటూ విరుచుకుపడ్డారు.  అంతే కాదు షర్మిల జగన్‌తో విభేదించడానికి కూడా కారణం విజయసాయి రెడ్డే అని మరో ట్వీట్ చేశారు. మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ వైసీపీని టార్గెట్ చేయలేదు. ఒక్క విజయసాయి రెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ను విజయసాయి రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.

బండ్ల గణేష్ ట్వీట్లు విజయసాయి రెడ్డిని బాధపెట్టేయేమో ఆయన కూడా వెంటనే స్పందించారు. ఆయన ట్వీట్ల భాష గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ తెలుసుంటుంది. ఆయన ట్వీట్ల భాష దిగువ స్థాయిలో ఉంటుంది. బండ్ల గణేష్ పైనా అదే స్థాయిలో విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి స్పందిస్తే ఇక బండ్ల గణేష్ ఎందుకు ఊరుకుంటారా ఆయన వెంటనే స్పందించారు. ఒకటికి రెండు తిట్లతో ట్వీట్లు పెట్టుకున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
Tirumala Goshala : తిరుమల గోశాల ఎప్పుడు ప్రారంభించారు? ఆవులు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి?
తిరుమల గోశాల ఎప్పుడు ప్రారంభించారు? ఆవులు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి?
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
Murshidabad Violence: ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
Embed widget