MLC Kavitha Telangana Jagruthi BRS Suspension | కన్నకూతురినే కాదనుకున్న కేసీఆర్ | ABP Desam
కల్వకుంట్ల కవిత...ఈ పేరు చెప్పగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె గానే కాదు..ఉద్యమ సమయం నుంచి తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన కవిత..తెలంగాణ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రయత్నం చేశారు. తన తండ్రి రాజకీయంగా వ్యూహాలు రచిస్తూ తెలంగాణను సాధించి తర్వాత ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి గద్దెను అధిష్ఠిస్తే..కవిత మాత్రం సాంస్కృతిక పునరుజ్జీవన బాధ్యతలను తనపై వేసుకున్నారు. ప్రత్యేకించి నిజాం కాలం నుంచి ఆంధ్రుల పాలన వరకూ తెలంగాణ పండుగలను, సంస్కృతిని కాలరాసే ప్రయత్నం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత 2006-2007 ప్రాంతంలో తెలంగాణ జాగృతి పేరిట స్వచ్ఛంద సంస్థను బీఆర్ఎస్ కు అనుబంధంగా నిర్వహిస్తూ తెలంగాణ పండుగలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి బతుకమ్మ పండుగకు తనే పర్యాయపదంలా మారేందుకు కవిత ప్రయత్నాలు చేశారు. రంగు రంగుల పూల పండుగను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేశారు కవిత. బోనాల పండక్కి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామదేవతలకు బోనం పట్టి మొక్కులు చెల్లించుకునేవారు. అలా సాంస్కృతికంగా తెలంగాణ పునరుజ్జీవననానికి తనవంతు ప్రయత్నం చేసిన కవిత రాజకీయంగానూ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఓసారి గెలిచినా...రెండోసారి ఎంపీగా ఓడి...ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించినా...తెలంగాణ రాజకీయాలపై తనదైన ముద్ర ఉండాలని తపనపడ్డారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పేరు వినిపించిన దగ్గర్నుంచి ఈడీ విచారణ, అరెస్టులతో కవిత ప్రతిష్ఠ మసకబారింది. జైలు నుంచి వచ్చిన తర్వాత తన పార్టీలోనే తనకు శత్రువులు తయారయ్యాంటూ దెయ్యాలు న్నాయంటూ వ్యాఖ్యలు చేసిన కవిత...హరీశ్, సంతోష్ లపై నేరుగా బాణాలు ఎక్కుపెట్టి ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ అయ్యారు.





















