Kavitha Sensational Comments on Harish Rao | ట్రబుల్ లో ట్రబుల్ షూటర్..గురి పెట్టిన పేల్చిన కవిత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ లకు భాగం ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాళ్ల వల్లే తన తండ్రి పై సీబీఐ ఎంక్వైరీ పడిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత...సీఎం రేవంత్ రెడ్డి హరీశ్, సంతోష్ లను కాపాడుతున్నారంటూ మరో సంచలన కామెంట్ చేశారు. ఇంతకీ కవిత మాటల్లో ఆంతర్యం ఏంటీ..? కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ మొదలైంది. హరీశ్ ను సమర్థిస్తూ ఇండైరెక్ట్ పోస్టులు బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్స్ లో పడ్డాయి. ఇక్కడితో ఆగలేదు..కవిత ప్రెస్ మీట్ సమాచారాన్ని కవిత పీఏ బీఆర్ఎస్ అఫీషియల్ గ్రూపుల్లో పోస్ట్ చేయగా...వాటిన్నంటినీ బీఆర్ఎస్ అడ్మిన్స్ తొలగించారు. పైగా కవిత పీఏ నెంబర్ ను గ్రూపుల నుంచి తీసేశారు. కేసీఆర్ కుమార్తె ప్రెస్ మీట్లను డిలీట్ చేయమనే ధైర్యం బయటకు వాళ్లకు ఉండదు కాబట్టి ఇదంతా పైనుంచి వచ్చిన ఆదేశాలే అని..ఈరోజే కవితపైనా పార్టీ క్రమశిక్షణా చర్యలు ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి బీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయం ఏంటీ..ఈ వీడియోలో చూసేయండి





















