Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP Desam
హైదరాబాద్ లో కొత్తరకం దొంగలు వచ్చారు. గతంలో నగరాన్ని వణికించిన చెడ్డీ గ్యాంగ్ తరహాలో ఇప్పుడు ఈ కొత్త గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. వీళ్లని చుడీదార్ దొంగలు అంటున్నారు. ఆడవారిలా చుడీదార్లు ముఖానికి ముసుగులు వేసుకుని వచ్చి దొంగతనం చేయటం వీళ్ల స్టైల్. మీరు చూస్తున్న ఈ విజువల్స్ SR నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో ని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీధుల్లో ఉదయం పూట ఇళ్లకు తాళం వేసి ఉన్నవాటిని గమనిస్తారు. వాళ్లు దూరప్రాంతాలకు వెళ్లారని తెలిస్తే చాలు రాత్రి పూట ఇలా చుడీదార్లు వేసుకుని వచ్చి దొంగతనం చేస్తారు. మే 18న SRనగర్ లోని ఓ అపార్ట్మెంట్ ను ఇలానే దోచేశారు. ఒంగోలుకు ప్రయాణమైన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అపార్ట్మెంట్ ను టార్గెట్ చేసి దోచేశారు. నాలుగు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ఖరీదైన ల్యాప్ టాప్ ను మాయం చేశారు. వీళ్ల టాక్టిట్స్ అన్నీ చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















