SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
'SSMB 29' సినిమాకి సంబంధించిన అప్డేడ్ నవంబర్ నెలలో వస్తుందని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ( Rajamouli ) ప్రకటించారు. ఆయన చెప్పిన నవంబర్ రానే వచ్చింది. #noveMBerwillbehiSStoRic, #noveMBer అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. అప్డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు పోస్టులు పెడుతుంటే మహేష్ బాబు ( Mahesh Babu ) కూడా వారితో జాయిన్ అయిపోయారు. ''ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది'' అంటూ జక్కన్నకు గుర్తు చేస్తూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. దానికి రాజమౌళి .. ఏ మూవీకి రివ్యూ ఇస్తున్నావ్ అని మహేశ్ ను ఆటపట్టిస్తూ.. చిన్నగా ఒక దాని తర్వాత ఒకటి రివీల్ చేద్దాం అన్నారు.
కొద్దీ సేపటికి ప్రియాంకను కూడా మహేష్ ట్యాగ్ చేస్తూ.. మీరు అప్‌డేట్ ఇచ్చేలా లేరు. కానీ మన దేశీగర్ల్ మాత్రం హైదరాబాద్‌లోని వీధులన్నింటీని Insta Stories లో పెడుతోందన్నారు. దానికి ప్రియాంక ( Priyanka Chopra ) రియాక్ట్ అయ్యారు. నువ్వు షూటింగ్ సెట్‌లో చెప్పిన సంగతులన్నీ లీక్ చేయమంటావా అని మహేష్ అడిగింది. అంతే కాదు.. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతా అంటూ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో రాజమళి…” నువ్వు అంతా నాశనం చేస్తున్నావ్ ప్రియాంక సర్‌ప్రైజ్ అనుకున్నాం కదా.. అన్నాడు. మరి పృధ్వీరాజ్ ( Prithviraj Sukumaran ) కూడానా అంటూ విల్లన్ ను లీక్ చేసారు మహేష్.
మీకు విలన్‌లు అంటే ఇష్టం కదా.. రాజమౌళి అని పృధ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ట్విట్టర్ వేదికగా జక్కన్న SSMB29కి సంబంధించి ఫ్యాన్స్ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. ఫైనల్‌గా నవంబర్‌లో అప్‌డేట్ ఇస్తామని చెప్పిన విషయాన్ని మహేష్ రాజమౌళికి గుర్తు చేశారు. దానికి రాజమౌళి కూడా ఒకే చెప్పారు.





















