Nithin Movie with Pooja Hegde | నితిన్ కు జోడీగా పూజా హెగ్డే ?
గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సెట్టిల్ అవ్వని హీరో నితిన్. భీష్మతో హిట్ అందుకున్న నితిన్.. ఆ తర్వాత అన్ని డిజాస్టర్లే చూసాడు. అయితే తమ్ముడు సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ కథల ఎంపికలో పొరపాట్లు చేశానని, ఇకపై ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేస్తానని చెప్పాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని నితిన్ కసిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు ఒకే చేసాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇష్క్’ బ్లాక్‌బస్టర్ అందుకుంది. సో తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే మళ్లీ నమ్ముకున్నాడు నితిన్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇక పూజా హెగ్దే విషయానికి వస్తే భాషలో సంబంధం లేకుండా వరుస ఫ్లోప్స్ అందుకుంటుంది. నితిన్ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే వీళ్ల జోడి సెట్ అవుతుందా లేదా అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే అ ఆ సినిమాలో నితిన్ కు జోడిగా సమంత నటించింది. నితిన్ సరసన సమంత సెట్ అవలేదని అన్నారు ఫ్యాన్స్. మరి నిజంగానే పూజ హెగ్డేని ఈ సినిమాలో తీసుకుంటే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.





















