అన్వేషించండి

Balka Suman: ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై దుష్ప్రచారం... నలుగురు వ్యక్తులు అరెస్టు.. పరారీలో ముగ్గురు యువకులు

ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌తోపాటు మహిళపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తులను అరెస్టు చేశారు వరంగల్‌ పోలీసులు. హుజురాబాద్‌ ఎన్నికల టైంలో వీడియోలు ఫేక్‌ వీడియోలు క్రియేట్ చేశాడు.

ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌కు కమాలపూర్ ప్రాంతానికి చెందిన మహిళతో చనువు వున్నాడంటూ సామాజిక మాద్యమం అయిన వాట్సప్ లో దుష్ప్రచారానికి పాల్పడిన నలుగురు యువకులను బుధవారం కమాలపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. బండి సదానందం, వడ్డె రమేష్, వసంతరావు, కడారి వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్నవారిలో సందీప్ ఠాకూర్, సునీల్ గౌడ్, లక్ష్మీ వీరమల్లును త్వరలోనే అరెస్ట్ చేస్తామని వివరించారు పోలీసులు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కమాలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని అద్దెకిచ్చారు. దీన్ని జీర్ణికంచుకోలేని ప్రత్యర్థులు అతడిపై కక్ష పెంచుకున్నారు. పార్టీ ప్రచారం కోసం కమాలపూర్ పార్టీ కార్యాలయానికి వస్తూపోతున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు సదరు ఇంటి సభ్యుల మధ్య వివాహహేతర సంబంధం ఉన్నట్లుగా నిందితుల్లో ఒకడైన సందీప్ ముందుగా ఒక వీడియోను రూపొందించారని చెప్పారు. ఈ వీడియోను మిగితా నిందితులతో కల్సి బాల్కసుమతో పాటు  మహిళ వ్యక్తిగత గౌరవాన్ని కించపర్చే విధంగా రూపొందించి సర్క్యులేట్‌ చేశారు. హుజురాబాద్‌తోపాటు హన్మకొండ జిల్లాలకు చెందిన వివిధ వాట్సప్ గ్రూప్‌ల ద్వారా దుష్ర్పచారం చేశారని పోలీసులు తెలిపారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న తర్వాత దర్యాప్తు చేసి నిందతులను అరెస్టు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌పై దుష్ప్రచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను గుర్తించగా ఇందులో ప్రస్తుతం నలుగురు అరెస్టు అయ్యారు. ఇంకో ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎవరైన వ్యక్తులుగాని సంస్థలు గాని ఇతరులను కించపరిచేలా, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా దుష్ప్రచారానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌. 

Also Read: ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలివ్వమని చెప్పండి.. ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ..

Also Read: ఏపీలో కొత్తగా 230 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి

Also Read:  మానేరులో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ.. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం

Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్‌ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్

Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్

Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'

Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం

Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...

Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...

Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget