News
News
X

vaccine for Alzheimers: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...

వయసు ముదురుతున్న కొద్దీ అల్జీమర్స్ వ్యాధి దాడిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది. లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

FOLLOW US: 

అల్జీమర్స్ తో బాధపడుతున్న ఎంతో మందికి ఇది ఊరటనిచ్చే వార్త. ఇంతవరకు మతిమరుపు వ్యాధికి మంచి చికిత్స, మందుల్లాంటివేవీ లేవు. ఆ వ్యాధిని అంత సీరియస్ గా కూడా చాలా మంది తీసుకోరు. కానీ  ఆధునిక కాలంలో అల్జీమర్స్ అనేక మందిపై దాడి చేస్తోంది. దీనివల్ల సాధారణ జీవితానికి దూరమై, ఇంట్లో వారికి భారమై, నలుగురిలో నవ్వులపాలవుతూ... ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బతికేస్తున్నారు. వారందరికి ఊరట కలిగించేలా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టారు. బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. అలాగే ఓ కొత్త ఔషధాన్ని కూడా కనిపెట్టారు. ఈ వ్యాక్సిన్, ఔషధం మార్కెట్లోకి రావడానికి కాస్త సమయం పడుతుందని, కానీ కచ్చితంగా అల్జీమర్స్ వ్యాధిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. 

ఎలా పనిచేస్తుంది?
మన మెదడులోని ప్లేక్స్ అని పిలిచే ఫలకాలలోని కణాలు అతిగా కుచించుకుపోవడం, కొన్ని మెదడు కణాలు మరణించడం వల్ల  మతిమరుపు వస్తుంది. ఈ ప్రక్రియను ఆపడానికి అమిలోయిడ్ అనే ప్రోటీన్ శరీరంలో ఉత్పత్తి చేయాలి. అలాగని ఎక్కువగా ఉత్పత్తి అయినా కూడా సమస్యే. అమిలాయిడ్ బీటాను వ్యాక్సిన్ రూపంలో ఇచ్చి అల్జీమర్స్ కు చికిత్స చేయొచ్చని పరిశోధకులు నిర్ణయించారు. ఇది TAP01_04 రకం యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ యాంటీ బాడీలు మెదడు కణాలను  చనిపోకుండా కాపాడడంతో పాటూ, రిపేర్ కూడా చేస్తాయి. 

పరిశోధకులు తయారుచేసిన ఔషధం, వ్యాక్సిన్... రెండూ మెదడులోని న్యూరాన్ల పనితీరును పునరుద్ధరించడానికి, మెదడులో గ్లూకోజ్ జీవక్రియను పెంచేందుకు, జ్ఞాపకశక్తిని పునరుద్ధరించడానికి సహకరిస్తాయి. అలాగే మెదడులో అమిలాయిడ్ బీటా ఫలకాలు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి.  దీనివల్ల అల్జీమర్స్ తగ్గుతుంది. ఈ వ్యాధి లేనివాళ్లు వ్యాక్సిన్ రూపంలో దీన్ని తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఆ తరువాత ప్రభుత్వం ఆమోదం లభిస్తే మార్కెట్లోకి వ్యాక్సిన్, ఔషధం రెండూ అడుగుపెడతాయి. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Read Also: గర్భం రాకపోయినా... గర్భం ధరించినట్టు అనిపించే లక్షణాలు, నమ్మి మోసపోకండి

Published at : 16 Nov 2021 01:36 PM (IST) Tags: Alzheimers vaccine for Alzheimers Drug for Alzheimers మతిమరుపు వ్యాధి

సంబంధిత కథనాలు

Skinny Jeans:స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోపోతే మీకే నష్టం

Skinny Jeans:స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోపోతే మీకే నష్టం

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

టాప్ స్టోరీస్

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?