By: ABP Desam | Updated at : 15 Nov 2021 01:46 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారపదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వంటి మహమ్మారితో పోరాడటానికి శరీరానికిన శక్తినిచ్చే వాటిలో ఈ ఆమ్లాలది మొదటి స్థానం. అందుకే ఆ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోమని సిఫారసు చేస్తారు వైద్యులు. రోజుకి మహిళలకు 1.1గ్రాము ఆమ్లాలు, పురుషులకు 1.6 గ్రాముల ఆమ్లాలు అవసరం పడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అనగానే అందరికీ గుర్తొచ్చే ఆహారం చేపలు మాత్రమే. నిజానికి చేపల్లోనే కాదు అనేక శాకాహారాల్లో కూడా ఇవి పుష్కలంగా లభిస్తాయి. శాకాహారులు, వీగన్లు కూడా వీటిని తిని ఫ్యాటీ ఆమ్లాలను పొందచ్చు.
1. వాల్‌నట్స్
మెదడు ఆకారంలో ఉండే గింజలు వాల్‌నట్స్. వాటిని చిరుతిండిగా రోజూ తినవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంవటాయి. నాలుగు వాల్‌నట్స్ తింటే 2.7 గ్రాముల ఆమ్లాలు శరీరంలో చేరతాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతోపాటూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తాయి.
Read Also: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
2. కిడ్నీబీన్స్
రాజ్మా లేదా కిడ్నీ బీన్స్... మొక్కల ఆధారిత ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను అందించే బీన్స్. రోజులో ఒక వ్యక్తికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లంలో 10 శాతం అవసరాన్ని ఇవి తీరుస్తాయి. అలాగే ఇనుము, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా అందుతుంది. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.
Read Also: ఇతడు గజినీల సంఘానికే లీడర్... ఆరుగంటలకోసారి అంతా మర్చిపోతాడు, చివరికి కొడుకు పుట్టిన సంగతి కూడా...
3. కనోలా ఆయిల్
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభించే వంటనూనెల్లో కనోలా ముఖ్యమైనది. కేవలం ఒక టేబుల్ స్పూన్ నూనెలో 1.28 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. ఈ నూనెలో విటమిన్ ఇ, కె కూడా పుష్కలంగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు కూడా తక్కువగా ఉంటుంది.
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
4. అవిసె గింజలు
ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటూ ఫైబర్ అధికంగా ఉంటుంది. మొక్కల ఆధారిత పదార్థం కనుక వీగన్లు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక వ్యక్తికి రోజులో అవసరమైన దానికంటే రెండు మూడు రెట్లు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయివి. అంతేకాదు వీటిలో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి.
Read Also: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
5. చియా గింజలు
బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా తినేది చియా సీడ్స్. గుప్పెడు చియా సీడ్స్ తింటే 5 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం కూడా కావాల్సినంత అందుతాయి.
Read Also: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది
Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే
Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో
Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి
Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కీలక ప్రకటన
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత