News
News
X

Longevity: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి

తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తెలిసిన విషయమే. ఓ మూడు మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని మరింత సమర్థవంతంగా కాపాడుకోవచ్చు.

FOLLOW US: 
Share:

ఆహారప్రియులకు చాలా ఇష్టమైనవి మసాలా దినుసులు. అవి వంటల్లో భోజనానికి రుచి తోడయ్యేది. అంతేకాదు చాలా మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ఆక్సీకరణ ఒత్తిడిని విడుదల చేయడం, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం వంటి పనులు కూడా చేస్తాయి. అధ్యయనాలు ప్రకారం కొన్ని మసాలా దినుసులు ప్రత్యేకంగా క్యాన్సర్ రిస్క్ ను అడ్డుకోవడం లో ముందుంటాయి. దీర్భాయుష్షును ప్రసాదిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి మూడు. ఈ మూడింటిని రోజూ వంటల్లో భాగం చేసుకుంటే చాలా మంచిది. క్యాన్సర్ వచ్చే ముప్పు సగం తగ్గినట్టే. 

1. దాల్చిన చెక్క 
దాల్చిన చెక్కను మనం కేవలం పులావ్, బిర్యానీలు వండినప్పుడో, నాన్ వెజ్ వంటకాలకో పరిమితం చేస్తుంటాం. కానీ నిజానికి కాస్త దాల్చిన చెక్క అన్ని వంటల్లో వేసుకుంటే ఉత్తమం. ఎన్నో అధ్యయనాలు దాల్చినచెక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి చెప్పాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో దాల్చిన చెక్కలోని సుగుణాలు బాగాపనిచేస్తాయి. తల, మెడ భాగాలలో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో, కణితిలు పెరగకుండా తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

2. పసుపు
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, ఔషధ గుణాల గురించి ప్రాచీన కాలంగా వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇందులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు నాలుగు గ్రాముల కర్కుమిన్ శరీరంలోకి వెళ్లి గాయాల తీవ్రతను 40 శాతం తగ్గించుకోవచ్చు. అంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ సమ్మేళనం. పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఈ కర్కుమిన్ శరీరంలో చేరాలంటే రోజూ వంటల్లో పసుపు వాడడం ప్రారంభించాలి. 

3.సేజ్
సేజ్ అనేది ఒకరకమైన ఆకులు. ఇంట్లోనే ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అల్టీమర్స్ వ్యాధిని రాకుండా అడ్డుకుంటాయి. వచ్చినా కూడా తగ్గించేందుకు సహకరిస్తాయి. నాలుగు నెలల పాటూ రోజూ సేజ్ ఆకులను వంటల్లో భాగం చేసుకుంటే ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గొంతునొప్పి, జలుబును నయం చేయడం, అలసట రాకుండా చేయడం వంటి ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కలిగిస్తాయి.

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే

Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...

Published at : 15 Nov 2021 08:58 AM (IST) Tags: Healthy food క్యాన్సర్ Longevity Healthy Spices Cancer risk

సంబంధిత కథనాలు

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు

టాప్ స్టోరీస్

Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం!

Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం!

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్

Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్

Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!

Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!